కావలసినదల్లా చాతుర్యం:- యామిజాల జగదీశ్
 అదొక చిన్న పట్టణం. కొన్నేళ్ళ క్రితం నాటి మాట. ఓ వ్యాపారి. అతని దగ్గర బోలెడంత డబ్బుంది. అతని దగ్గర ఓ పెద్దతను అప్పు తీసుకున్నాడు. అతనేమీ సుందరాంగుడు కాడు. అయితే అతను ఆ వ్యాపారి కూతురుని ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. తనంటే వ్యాపారికి ఇష్టమన్న సంగతి గ్రహిస్తాడు. అవకాశం కోసం చూస్తున్నాడు. ఓ రోజు ఈ వ్యవహారం ఆయన ముందుకొచ్చింది.
వ్యాపారి ఓ మాట అన్నాడు. తన కూతురుని పెళ్ళి చేసుకుంటే నీ అప్పంతా మాఫీ చేస్తానంటాడు. అయితే తానేదో నిజాయితీపరుడైనట్టు నిరూపించాలనుకుని ఒ దొంగనాటకం ఆడుతాడు.  
అప్పు తీసుకున్న పెద్దతను కావాలనే ఓ ప్రతిపాదన చేస్తాడు.
నేను ఓ సంచిలో రెండు చలవరాళ్ళు ఉంచుతాను. అవి తెలుపు, నలుపు రాళ్ళు.
మీ కూతురు ఆ రెండు రాళ్లలో ఏదో ఒక రాయి తీస్తే దాన్ని బట్టి నా అడుగుంటుంది అంటాడు.
ఆమెగానీ నల్ల రాయి తీస్తే మీరు నా అప్పు మాఫీ చేయాలి. అలాగే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్ళి చేయాలంటాడు. అలాకాకుండా మీ అమ్మాయికానీ తెల్లరాయి గానీ తీస్తే అప్పు మాఫీ అవుతుంది. మీ కూతురుని నాకిచ్చి పెళ్ళి చేయనక్కరలేదు అంటాడు. ఇందుకు వ్యాపారి ఒప్పుకుంటాడు.
ఇక్కడో విషయం గమనించాలి.
ఈ మాటల తతంగమంతా ఆ వ్యాపారి ఆవరణలో ఉన్న పెద్ద తోటలో జరుగుతుంది.
వ్యాపారి రెండు చలవరాళ్ళు తీసి సంచీలో పెట్టుకోమంటాడు.
అప్పు తీసుకున్న పెద్దతను ఇక ఆలస్యం ఎందుకన్నట్టు తోటలో ఓ చోట నిల్చుని కిందకు వంగి రెండు రాళ్ళు తీస్తాడు. ఆ రెండు రాళ్ళూ నల్లరంగువే. ఈ విషయాన్ని వ్యాపారి కూతురు చూడనే చూసింది.
కనుక ఆమె ముందున్న మూడు ప్రత్యామ్నాయాలు ఇవి...
ఒకటి – సంచీలోంచి చలువరాయి తీయడానికి తిరస్కరించడం.
రెండు – సంచీలోంచి రెండు రాళ్ళూ ఒకేసారి తీసి అతని అనైతికతను బయట పెట్టడం.
మూడు – విషయం తెలుసు కనుక తండ్రిని తృప్తి పరచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఓ రాయి తీసి ఆ పెద్దతనికి భార్య కావడం.
తండ్రి ఓ రాయి తీయమంటాడు.
ఆమె సరేనని సంచీలోంచి ఓ రాయి తీసినట్టే తీసి నేలమీద ఉన్న మిగిలిన రాళ్ళమధ్య కావాలనే చేజారుస్తుంది.
అంతేకాకుండా ఆ పెద్దతనితో ఇలా చెప్పింది....
“నేనెంత దురదృష్టవంతురాలినో కదూ. సంచీలో మిగిలి ఉన్న రాయి మీకు తెలియంది కాదు. నేలమీద పడేసిన రాయి రంగేంటో మీకు తెలుసు. అదెందుకు పడిపోయిందో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు సంచీలో ఉన్నది నల్ల రాయే అన్న సంగతి మీకు తెలుసు...” అని.
పెద్దతనికి పరిస్థితి అర్థమైంది. తన దుర్బుద్ధి ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డా వ్యాపారికి అసలు విషయం తెలీదు కనకు తాను బతికానని అనుకుంటాడు మనసులో. సంచీలో ఉన్నది నల్లరాయి కాబట్టి తన కూతురు చేజార్చిన రాయి తెల్ల రాయే అయి ఉంటుందనుకుంటాడు వ్యాపారి.  ముందనుకున్న ఒప్పందం ప్రకారం వ్యాపారి అతని  అప్పు మాఫీ చేస్తాడు. అమ్మాయితో పెళ్ళి జరగదు.  
ఈ కథతో తెలుసుకోవలసినదేమిటంటే....
ఎటువంటి క్లిష్టపరిస్థితినైనా అధిగమించవచ్చు. కానీ ఓ సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి బయటపడడానికి కావలసినదల్లా చాతుర్యం. అంతే తప్ప కంగారు పడిపోవడం కాదు. దాని పడడం వల్ల ఏ లాభమూ ఉండదు.
తనను తాను బయటపడటమే కాకుండా అవతలి వ్యక్తి అనైతికతనూ బయటపెట్టడం తనకు ఇష్టం లేక నడచుకున్న తీరుకు మనసులో సంతోషిస్తుంది.  ఆమె తన చతురతతో  ఆ పెద్దతనిని పెళ్ళి చేసుకునే స్థితి నుంచి సురక్షితంగా బయటపడింది.

కామెంట్‌లు