*ఎలైట్ సంస్థ లో బాధ్యతలు*



  *రఘుపతిరావు, మంజులా సూర్యలు ఎంపిక* 
--------------
సాహిత్యంలో కథ, కవిత, విమర్శ రంగాల్లో ప్రతిభ కనబరిచే రచయితలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రముఖ సాహితీవేత్త, ఐబిఆర్ఎఫ్ సభ్యులు డా. చిటికెన కిరణ్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్న ఎలైట్ రైటర్స్ అసోసియేషన్లో కీలక నియామకాలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం వేములవాడ పట్టణానికి చెందిన రచయిత గడప రఘుపతిరావు, హైదరాబాద్ నగరానికి చెందిన కవయిత్రి మంజులా సూర్యలను ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సంస్థ అధ్యక్షులు డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక చేశారు.
సంస్థ నిర్వహించబోయే సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సాహిత్య సేవలో ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా  సూచించారు. ఈ నియామకాలపై సంస్థ నిర్వాహకులు కందాళ పద్మావతి, కట్టెకోల విద్యుల్లత, రామగిరి సుజాత, వసంత లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలియజేశారని సంస్థ  అడ్వర్టైజింగ్ మీడియా ఇంచార్జ్  ఎన్. శ్రీకాంత్ తెలిపారు.
కామెంట్‌లు