రాజ్యాంగపూర్వం -అనంతరం : - నామ వెంకటేశ్వర్లు, తెలుగు ఉపాధ్యాయుడు, అయిటిపాముల, నల్గొండ.

  భారతీయులందరికీ  77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  తెలుపుతూ.. రాజ్యాంగ రచన పూర్వోపరాలను నాకు తెలిసిన, చదివి,   గ్రహించి విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటుంన్నాను 
 స్వాతంత్రానికి పూర్వం:- 
         స్వతంత్రానికి పూర్వo భారత దేశ చరిత్రను రెండు దశలుగా చెప్పుకోవచ్చు.  
                                          01.బ్రిటిష్ పూర్వం:- ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో కొంత మరియు కంపెనీ పరిపాలన. బ్రిటిష్ వారికి ముందు భారతదేశంలో ప్రజలు అనేక వివక్షంతలతో, సామాజిక అసమానతలతో జీవించేవారు.ఆనాటి రాజ్యంలో రాజులను కూడా బ్రాహ్మణులు వారి గుపిట్లో పెట్టుకుని ఆనాటి  సమాజాన్ని చీలికలు పేలికలుగాచేసి చదువు, మంచి తిండి,  మంచి బట్ట, మంచి నగ (బంగారు, వెండి ) అనుభవించే స్వేచ్ఛ లేకుండా ఉండేది. దానికోసం సమాజంలో అనేక సామాజిక పోరాటాలు సాగుతూ ఉండేది.  ప్రజలను అనేక మూఢనమ్మకాలతో చుట్టేసి వారు పబ్బం గడిపేవారు. ప్రజల మధ్య సామాజిక సమానత్వం సాధన కోసం పోరాడి అనేక మంది మహనీయులు తమ ప్రాణాలర్పించారు.  
      02. ఈస్ట్ ఇండియా- బ్రిటిష్ పాలనలో:- ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలో ప్రవేశించే నాటికి భారతదేశంలో రాజుల మధ్య అనైక్యత  ఏర్పడింది. వారు రాజ్య విస్తరణ కాంక్షతో వారిలో వారుఎన్నో యుద్ధాలు చేశారు. అలా ఆ రాజులలో కొందరు ప్రజారంజక పాలనను అందించారు. కొందరు నియంతలుగా ప్రజలను పరిపాలించడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ సమయంలోనే విదేశీయులైన  డచ్చు, పోర్చుగీసు,   ప్రెంచు, ఆంగ్లేయులు  వ్యాపారం కోసం రావడం జరిగింది. అందులో చివరగా 1599 వచ్చారు. వ్యాపారంలో ఆధిపత్యం కోసం ఆ నలుగురి మధ్య అనేక పోరాటాలు జరిగాయి. చివరికి ఆంగ్లేయులు అందరిని ఓడించి  వ్యాపారంలో బలవంతులుగా  ఎదగడం జరిగింది. వాళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం కొనసాగించారు. ఆ తర్వాత వాళ్లు తమ వ్యాపారాలు కాపాడుకోవడానికి సొంతంగా  సైన్యం తయారు చేసుకుని చివరికి    భారతీయ రాజులకు యుద్దాలలోవాళ్లకు సైన్యాన్ని అద్దెకు ఇచ్చేవారు. చివరికి భారతీయ రాజులను సైన్యాన్ని తయారు చేసుకోవద్దు అని కూడా ఆజ్ఞలు జారీ చేసే స్థితికి ఎదిగారు. ఇలా భారతీయ రాజులకు సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టిన   బ్రిటిష్ గవర్నర్ జనరల్ డలౌసి. చివరగా భారతీయులకు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి మధ్య ప్లాసి అనే దగ్గర జరిగిన యుద్ధముమే 1757 ప్లాసి  యుద్ధం. అప్పటినుంచి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభం కావడం జరిగింది.  ఆ తర్వాత భారత దేశంలో అనేక రాజుల రాజ్యాల మీదికి వారు దాడి చేసి రాజ్యాలను ఆక్రమించుకొని, బలవంతంగా, ఒప్పందం చేసుకుంటూ  వ్యాపార స్థావరాలను  ఏర్పరచుకున్నారు. ఆర్థికంగా బాగా బలపడ్డారు. ఆ తర్వాత ఆ సైన్యంలో భారతీయులు కూడా చేరడం జరిగింది. ఒకసారి ఒక బ్రిటిష్ సైన్యాధికారి ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను తయారు చేసి భారతీయ సైనికులను ఉపయోగించమన్నారు. ఈ విషయం సైన్యంలోని ఒక సైనికుడైన మoగల్ పాండే గ్రహించి, మా భారతీయులకు అవి రెండు  నిషేధమే ( హిందువులకు ఆవు, పంది ) కావున మేము వాటిని ప్రయోగించమని నిక్కచ్చిగా అధికారికి చెప్పాడు. కాని వారు బలవంతం చేశారు.1857 సం.. లో మంగల్ పాండే నాయకత్వం లో  ఈస్ట్ ఇండియా కంపెనీకి  వ్యతిరేకంగా పోరాటం సాగించారు.  అదే చరిత్రలో సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పిలువబడింది. ఆ పోరాటంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతోజరిగిన పోరాటంలో భారతీయ సైన్యం ఓడిపోవడం. ఆ తర్వాత భారతదేశంలో  ప్రత్యక్ష బ్రిటీష్ పాలన ప్రారంభమైంది. ఆ తర్వాత భారత దేశంలో ప్రజలను ఆనాటి కొందరు బ్రాహ్మణుల సహకారంతో బానిసలుగా చేసి హింసించి సమాజాన్ని మరింత దిగజార్చారు, దోచుకున్నార ఆనాడు సామాజిక సమానత్వం కోసం పోరాటం సాగించిన వారిలో, మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియర్ ఇ వి రామస్వామి, స్వామి నారాయణ గౌడ్, ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారలు. (వారికి పూర్వం భారతదేశంలో  మొట్టమొదటిసారిగా   మానవులంతా సమానులంటూ చెబుతూ ఆచరించినటువంటి, ప్రచారం చేసిన వారు బోధిసత్వ, తధాగత్ గౌతమ బుద్ధుల వారు. )
03. జాతీయ ఉద్యమం:-       అ.భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కూడా రెండు దశలుగా సాగింది. 1915 ముందు, 1915 తర్వాత. 1915 కు ముందు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి మహా గొప్ప వీరులు వీరోచితంగా పోరాడి చివరికి, బ్రిటిష్ వారి చేతిలో కొందరు, వారి చేతిలో చావడం ఇష్టం లేక తమకు తామే కాల్చుకునే కొందరు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ కాలంలో సాగిన ఉద్యమం దెబ్బకు దెబ్బ అన్న విధంగా కొనసాగింది. వారి పోరాటాన్ని పటిమను చూసి బ్రిటిష్ పాలకులంతా బెంబేలెత్తిపోయారు. ఒకానొక దశలో భారతదేశానికి స్వతంత్రము ఇవ్వాలని నిశ్చయిoచ్చుకున్నారు కూడ. కానీ భారతదేశంలో కొందరు స్వార్థపరుల వల్ల స్వతంత్రం రాకుండా ఆలస్యం కావడం జరిగింది.( ఇదే చరిత్రలో అతివాద పోరాటంగా పిలిచారు )ఈ సమయంలోనే మరోవైపు 1885 భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసుకుని నెహ్రూ,  పటేల్ లాంటి నాయకుల నాయకత్వంలో జాతీయ ఉద్యమం సాగుతూ ఉండేది. ( ఇదే చరిత్రలో మితవాద పోరాటం గా పిలిచారు ) రెండు వేరు వేరు గ్రూపులుగా విడిపోయి కూడా ఒకే లక్ష్యం కోసం పనిచేశారు.
     ఆ. 1915 తరువాత :- 1915 కు పూర్వం స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి పాత్ర ఏమీ లేదు. వారప్పుడు ఇంగ్లాండులో ఉన్నారు. వారక్కడ బారిష్టర్ చదువుతూనే భారతీయ రైతుల కోసం పోరాటాలు చేస్తూ ఉండేవారు. 1915 తర్వాత గాంధీ గారు భారతదేశం రావడం జరిగింది. అప్పటివరకు దెబ్బకు దెబ్బ, బాంబుకు బాంబు అన్న ధోరణిలో జాతీయ ఉద్యమం  జరుగుతూ ఉంటే, అందులో చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇలా అయితే మనకు చాలా నష్టం జరుగుతుందని ఆలోచించి స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీ నాయకత్వం వహించి సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి  శాంతి, అహింస, సత్యాగ్రహం, లను ఆయుధాలుగా చేసుకుని స్వతంత్ర పోరాటం సాగించడం జరిగింది. అందులో ముఖ్యమైన ఘట్టాలు సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం,( దండి సత్యాగ్రహం) క్విట్ ఇండియా ఉద్యమం. ( డూ ఆర్ డై నినాదం ) చేసి బ్రిటిష్ పాలకుల తలలు వంచడం జరిగింది. చివరికి 1947లో స్వతంత్రం ఇస్తామని బ్రిటిష్ పాలకులు ప్రకటించే వరకు కొనసాగింది. 
  
     స్వతంత్ర ప్రకటన చేసేటప్పుడు  మీరు మీ భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి కావలసిన చట్టాలను తయారు చేసుకోమని మన భారతీయులకు చెప్పడం జరిగింది. 
04. రాజ్యాంగ రచన:- 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన సందర్భంలో దేశ ప్రజలందరూ ఆనందోత్సవాలతో కేరింతల కొడుతూ పండగ చేసుకుంటున్నారు.  ఆ సమయంలోనే భారతదేశానికి కావలసినటువంటి చట్టాలను శాసనాలు రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (అంతకు ముందు భారతీయులంతా బ్రిటిష్ రాజ్యాంగ ప్రకారం పాలించబడేవారు. ) భారత దేశ ప్రభుత్వ పాలన గురించి, ప్రజల హక్కులు విధుల గురించి ప్రణాళిక తయారు చేయడానికి, భారత రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ కు అధ్యక్షుడుగా డా" బాబు రాజేంద్రప్రసాద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు. రాజ్యాంగ రచన చేయాలంటే ఈ రాజ్యాంగ పరిషత్ కు సభ్యులు గా ఎన్నికై ఉండాలి. దాదాపు 253 మందితో ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనిలో నుంచి అనేక కమిటీలు ఏర్పాటు చేయడానికి  ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ ఎన్నికలలో అంబేద్కర్ గారు కూడా పోటీ చేయడం జరిగింది. ఆనాటి బ్రాహ్మణ భావజాలం మరోసారి బయటపడింది. ఒకసారి అంబెడ్కర్ గారు పోటీ చేస్తే ఒడించారు, మరోసారి తను గెలిచిన ప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి, ఈ భారతీయ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల న్యాయం జరగాలంటే తప్పనిసరిగా నేను రాజ్యాంగ పరిషత్ లో ఉండాలి అన్ని విన్నవించుకున్నారు.   వివక్షతో నన్ను రాజ్యాంగ పరిషత్ కు ఎన్నిక కాకుండా చేస్తున్నారు చెప్పగానే బ్రిటీష్ ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగ పరిషత్ లో అంబేద్కర్ గారు లేకుంటే మీకు మేము స్వాతంత్రం ఇవ్వము అని ఒక లేఖ రాశారు  భారతదేశ నాయకత్వానికి . వెంటనే అప్పుడు బెంగాల్లో ఎన్నికైన ఒక సభ్యుడిని రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేద్కర్ గారిని పోటీ చేయించి గెలిపించారు. ఆ తర్వాత అనేక కమిటీలు వేశారు. అందులో ముఖ్యమైన కమిటీ రాజ్యాంగ రచన కమిటీ. రాజ్యాంగ రచన ఎవరు చేస్తారని చాలా దీర్ఘంగా ఆలోచించారు. అప్పుడు అమెరికా రాజ్యాంగం లాంటి మూడు దేశాల రాజ్యాంగాలు రాసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి, మా దేశ రాజ్యాంగాన్ని రాయండి అని కోరారు. అతని మీద ఏ దేశం అని అడిగాడు. మాది భారత దేశమని మనవారు చెప్పడం జరిగింది. నేను వివిధ రాజ్యాంగాలు రాసేటప్పుడు నాకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి, జ్ఞానవంతుడు మీ దేశంలోనే ఉన్నాడు అతనే .. అతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని అనగానే,  అప్పుడు వెంటనే నెహ్రూ  నాయకత్వం భారతదేశానికి  తిరిగి వచ్చి, రాజ్యాంగ రచనా కమిటీ కి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరు ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. దానిలో మొత్తం ఏడుగురు సభ్యులు తర్వాత ఆ కమిటీ సభ్యులు ఒకరు చనిపోయారు, వారి స్థానంలో ఎవరిని నియమించలేదు, ఒకరు విదేశాల్లో ఉన్నారు, ఇంకొకరు స్థానిక రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ దూరంగా ఉందని రాలేకపోయారు. ఇద్దరు ఇష్టం లేక రాలేదు. చివరికి రాజ్యాంగ రచన భారమంతా అంబేద్కర్ గారు మీదనే పడడం జరిగింది. (అంతకుముందే బి.యన్ రావు గారు మాధురి నకుల రాజ్యాంగాన్ని రాశారు. కానీ అది భారతీయులoదరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వలేదని దానిని రద్దు చేశారు. ) చివరికి ఒక్కడే రాత్రి పగలు  కష్టపడి  ఎవరెవరికి ఏ విధమైనటువంటి హక్కులు ఉండాలని ఆలోచించి, వివిధ దేశాల రాజ్యాంగంలో మన దేశ ప్రజలకు అవసరమైన విషయాలను సేకరించి, వాటి తో పాటు 1935 లో భారతీయుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం నుండి అధిక భాగం గ్రహించి,   చివరికి రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల కష్టపడి, 1947 అక్టోబర్ లో తయారుచేసి ఇచారు , ఆ తర్వాత దేశంలో రాజ్యాంగమును చర్చ కు ప్రవేశపెట్టిన తర్వాత,  అనేక చర్చలు జరిగిన తర్వాత  1949 నవంబర్ 29న ఆమోదించడం జరిగింది. ఒకసారి రాజ్యాంగ పరిషత్తులో  చర్చ జరుగుతూ ఉంటే తమిళనాడు నంబుద్రి  బ్రాహ్మణుడైన ఒకరు లేచి, రాజ్యాంగ రచనకు ఏడుగురు సభ్యులు ఎన్నిక  చేసినప్పటికీ, రాజ్యాంగ రచన చేసే భారం అంతా ఒక అంబేద్కర్ మీదనే పడింది. ఈ విషయంలో వారిని శంకించరాదు అని ప్రకటించారు. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్లో కొందరు నోటికి వచ్చినట్లు రాజ్యాంగ రచన అంబేద్కర్ ఒక్కరే చేయలేదు. 253 మంది ఉన్నారు అని ఏవేవో  మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజే రోజా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతే ఇది మంచి రాజ్యాంగం, అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ రాజ్యాంగంగా పేరొందుతుంది  అని అన్నారు. ఆ తర్వాత  రాజ్యాంగము సరిగా అమలు చేయని రోజున, రాజ్యాంగను నేనే తగలబెడతాను అన్నాడు. ఈ మాటను ఇప్పుడు కొందరు స్వార్ధపరులు ఈ రాజ్యాంగం బాగాలేదు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారె ఆనాడు తగలబెడతానని అన్నారని అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇలాంటి మాటలు అన్ని అంశాలు  సరిగా తెలిసినటువంటి వారు మాట్లాడి ఉండరు. ఆ తర్వాత భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి  వచ్చింది. రాజ్యాంగం ప్రపంచంలోనే లిఖిత, దృఢమైనటువంటి, అతిపెద్ద రాజ్యాంగం గా గుర్తించబడింది. అందుకనే భారత రాజ్యాంగాన్నిఏనుగు తో పోల్చడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రభుత్వం ఉండాలి , ప్రభుత్వాలు ఎలా పాలించాలి, చట్టాలు శాసనాలు ఎలా ఉండాలో రూపొందించడం జరిగింది. ఇది భారతదేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు అనుగుణంగా రూపొందించబడినటువంటి రాజ్యాంగం ఇది.
           రాజ్యాంగ రచన కమిటీ కీ చైర్మన్ గా అంబేద్కర్ గారినే ఎంపిక చేసి,అప్పజెప్పడానికి అతనికున్న అర్హతలు, ఇతరులకు లేనివి ఏమిటో గూడా ఈ సమయంలో స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 
 అర్హతలు:- 1.విదేశాలలో చదువుకోవడం.కేంబ్రిడ్జి  విద్యాలయంలో చదువుకోవడం, మూడు సంవత్సరాల్లో 2 పీహెచ్డీ లు పూర్తి చేయడం, అందులో ఆనాడు అర్థికశాస్త్రంలో పిహెచ్డి చేసిన మొదటి భారతీయుడు కావడం. వారి జ్ఞానానికి గుర్తుగా అతని రచనలను  కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో సిలబస్ గా పెట్టడం. ఆ విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో  ప్రపంచంలో అతి ప్రభావాత్మకమైన వ్యక్తి అంబేద్కర్ అని తేలడంతో, అందుకుగాను ఆ విశ్వ విద్యాలయంలో  ఒక భాగానికి అతని పేరు పెట్టడం.  అక్కడనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టించడం. మరోటి లండన్ లో ఉన్న లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివినటువంటి వారిలో ప్రపంచంలోనాలుగో వ్యక్తి, ఆసియా ఖండం లో మొదటి వ్యక్తి కావడం విశేషం. 50వేల పుస్తకాలు చదివి, లక్ష పేజీల నోట్స్ రాసుకోవడం మరో విశేషం. బారెట్లా చదివి ఆ అసోసియేషన్ లో మెంబర్గా ఉండడం. ఇవే కాకుండా అతని కృషి ఫలితంగా  జాతీయ జెండాలో అశోక చక్రం ఉండడం, మూడు సింహాల సింబల్ కింద సత్యమేవ జయతే అని రాయడం, భారతదేశంలో ఆర్బిఐ స్థాపనకు కారకుడు. ( వారు రాసినటువంటి ప్రాబ్లం రూపీ అనే వ్యాసం ఆధారంగా నే ) వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించడం జరిగింది. 
     అలాంటి గొప్ప మహనీయుని న్ని గుర్తు చేసుకుంటూ, స్ఫూర్తి గైకొని అతని అసలు ఆశయాలను మన భారతీయులమంతా ఆచరించి ముందుకు వెళ్దాం.
            ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న అన్ని రకాల పక్షులకు పశువులకు ఇతర జంతువులకు, నింగికి నేలకు, అన్ని వర్గాల  ప్రజలందరికీ, మతాలకి రక్షణ కల్పిస్తున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి ఇప్పుడు తూట్లు పొడుస్తున్నటువంటి సమయం చాలా రోజుల నుంచి ప్రారంభమైంది. కావున మనమందరం చాలా అప్రమత్తం ఉండాలి. లేకపొతే మరల వెనుకటి రోజులకు వెళ్లాల్సి వస్తుంది. గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.

కామెంట్‌లు