దేవునిపై విశ్వాసం ఎందుకు?: -- యామిజాల జగదీశ్
 భక్తుడు : కృష్ణా, దేవునిపై విశ్వాసం ఎందుకు ఉండాలి?
కృష్ణుడు : రేపు చెబుతాను.
మరుసటి రోజు ...
కృష్ణుడు : మిత్రమా, ఆవు మంచి జంతువేనా?
భక్తుడు : కృష్ణా! మీరిలా అడగడం ఆశ్చర్యంగా ఉంది. ఆవు అనే మాట వినడంతోనే, నువ్వే గుర్తుకొస్తారు కృష్ణా. 
కృష్ణుడు : అది సరేగానీ నేను అడిగిన దానికి సమాధానం రాలేదు.
భక్తుడు : ఆవు జంతువులలో ఉత్తమమైనది. చాలా?
కృష్ణుడు : అటువంటప్పుడు ఆవుని నడిపించడానికి మరొకరెందుకూ? 
దాని మానాన దానిని వదిలేయొచ్చుగా?
భక్తుడు : కృష్ణా, అదెలా? దానికే మైనా జ్ఞానముందా? అది దారి తప్పి ఎక్కడికైనా వెళ్తే ఏమి చేయాలి? అందుకే పశువులకాపరి తప్పనిసరి.
కృష్ణుడు : నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకు ఇదే నా సమాధానం. నువ్వింకా అజ్ఞానంలోనే ఉన్నావు.
దారి తప్పితే ఏం చేయాలి? నిన్ను సన్మార్గంలో నడిపించటానికి ఒక కాపరిగా నేనవసరమే కదా?! ఇప్పుడు చెప్పు భగవంతునిపై విశ్వాసం ఉండాలా వద్దా?
భక్తుడు : కృష్ణా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నీకు నమస్సులు.


కామెంట్‌లు