ఎన్నాళ్లీ....!? :- కోరాడ నరసింహా రావు!
బాహ్య ముఖం ప్రపంచాన్ని  చూస్తే... 
అంతర్ముఖం పరమాత్మను చూస్తుంది...! 
 
 పరమాత్మను చూడట మంటే.... 
   నిన్ను నువ్వు... నీ మూలాలను చూసు కోవ టమే...!! 

అంతర్ముఖుల మవ్వట మంటే...
 ఆత్మపరిశీలన చేసుకోవట మేనోయ్...! 

నేను నేను అనుకుంటున్న ఈ నేను ఎవరు...!? 
  అది తెలుసుకుంటే.... 
  నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే...! 
   ఈ ప్రపంచాన్ని తెలుసు కున్నట్టే...!! 
   నిన్ను, ఈ ప్రపంచాన్ని  తెలుసుకుంటే... 
   ఆ పరమాత్మను , పరమాత్మ తత్వాన్ని తెలుసు కున్నట్టే నోయ్ ! 

అప్పుడిక నీవు... 
 ద్వంద్వాతీతుడవు... 
   త్రుగుణ రహితుడవు... 
 ఏ క్లేషములు  లేని ఆనంద స్వరూపుడవు ! 
  
అదే నోయ్ నీ నిజ స్వరూ పం...!! 

ఇంకా... ఎన్నాళ్లీ పై పై పరుగులు...?! 
   అవి భ్రమ, ప్రమాదాలకు మూలమైన మృగతృష్ణ లోయ్...! 
 
లే.... ఇంక ఈ బయటి పరుగులు ఆపి... 
  అంతర్ముఖుడవుకా...! 
  ఆత్మ జ్ఞా ని వై... 
  జీవన్మరణ బంధ విముక్తు డవై.... 
 అమరత్వాన్ని పొందు...! 
       ******

కామెంట్‌లు