ముహమ్మద్ ప్రవక్త పై కవితా గానం పోలయ్య కవి కూకట్లపల్లికి ఘనసన్మానం
 ఇదార అదాబ్ ఇస్లామీ హింద్ తెలంగాణసంస్థ ఆధ్వర్యంలో... అబు నబీల్ ఖాజా మసిహుద్దీన్ అధ్యక్షతన...63 మంది కవులు వ్రాసిన..."ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు" కవితా సంపుటి ఆవిష్కరణ... మరియు "ఇస్లామీయా సాహిత్య వేదిక"...ఆవిర్భావ సభ సోమవారం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది
ఈ సందర్భంగా నలుగురు సమన్వయ కర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో హైదరాబాద్ అత్తాపూర్ నివాసి ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని "మహా సంఘ సంస్కర్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం" శీర్షికతో కవితాగానం చేసి ప్రముఖ సాహితీమూర్తుల ప్రశంసలు అందుకున్నారు
ముఖ్య అతిథులుగా...గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
శాంతి కృష్ణ, నాళేశ్వరం శంకరం టి.గౌరీశంకర్, ఆలపాటి, తదితర సాహితీమూర్తులు ముస్లిం పెద్దలు కవులు హాజరై ప్రసంగించారు... 
తదనంతరం అతిథులను కవితగానం చేసిన కవులను కవయిత్రులను ఘనంగా సన్మానించారు
సన్మానగ్రహీత పోలయ్య కవి కూకట్లపల్లి మాట్లాడుతూ నేడు ఆవిష్కరించిన కవితా సంపుటిలో తాను వ్రాసిన..."మహా సంఘసంస్కర్త ముహమ్మద్ ప్రవక్త" అనే కవితకు స్థానం కల్పించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు
తనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి...ఒక
ఆథ్యాత్మిక  కవితను గానం చేయించి... చక్కని మెమోంటోతో...విలువైన శాలువాతో...అందమైన
ప్రశంసా పత్రంతో...కవితా సంపుటితో...ఘనంగా సన్మానించినందుకు సభా అధ్యక్షుల్ని ప్రత్యేకంగా సహృదయులు ఆత్మీయ సాహితీ మిత్రులు మొహమ్మద్ రషీద్ భాయ్ కి పోలయ్య కవి కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సభలో మోటూరి, అరవా, గొర్రెపాటి, వందనం, విజయశ్రీ‌‌, పద్మావతి, డా.నాగేశ్వరరావు, ఇంకా చాలా మంది ముస్లిం కవులు కవయిత్రులు 
ప్రవక్త ముహమ్మద్ ను శ్లాఘిస్తూ చక్కని కవితల్ని గానం చేసి..."అన్ని మతాల సారం ఒక్కటేనని"... "మతోన్మాదం వద్దని, మతసామరస్యమే ముద్దని"
"ముక్త కంఠంతో మానవత్వమే మన మతమన్న"...
"దివ్య సందేశంతో సభ దిగ్విజయంగా ముగిసింది.

కామెంట్‌లు