"స్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం" అందుకున్న తెలుగు భాషా సాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు


 సింగారం గ్రామానికి చెందిన తెలుగు ఉపన్యాసకులు, సాహితీవేత్త డా. వాసరవేణి పర్శరాములు తెలుగు భాషా సాహిత్యంలో కృషికి గాను "స్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం" హైదరాబాద్లో త్యాగరాయ గానసభలో అందుకున్నారు.
    జనవరి 12 న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో ఆదిలీల ఫౌండేషన్ న్యూఢిల్లీ మరియు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో  డా.వాసరవేణి పర్శరాములు తెలుగు భాషా సాహిత్యంలో కృషికి గుర్తింపుగా "స్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం"ను అందించారు. 
       పర్శరాములు ఇప్పటికే తెలుగు సాహిత్యంలో చుక్ చుక్ రైలు,చల్ చల్ గుర్రం, చిర్రగోనె, నారుమడి,చెట్టిరుక, ఓస్వార్థ రాజకీయనాయకుల్లారా!, మట్టిలో మాణిక్యం, చైతనమూర్తి,కర్రెద్దు, పరశురామ తెలుగు బాల శతకం, ఆకుఅలం, తంగెడుచెట్టు, నాన్న చెప్పిన కథలు, గొర్రె పిల్ల, వంగుడు దుంకుడు మొదలగు పుస్తకాలు ఎన్నో రాశారు. బాలసాహిత్యంలో  పిహెచ్ డి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు."ఉత్తమసాహితీవేత్త పురస్కారం, "తెలుగు యూనివర్సిటీ బాలసాహిత్య కీర్తి పురస్కారం" ఎన్నో అవార్డులు అందుకున్నారు. 25 సంవత్సరాలుగా తెలుగుభాష బోధిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటలో తెలుగు బోధిస్తున్నారు.
     ముచ్చటగా మూడోసారి ముద్రణ పొందిన డా.వాసరవేణి పరశురాం రాసిన "నారుమడి" పుస్తకం అతిథుల చేతులమీదుగా ఆవిష్కరించారు.
       ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలచారి, రాష్ట్ర మాజీ బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, తెలంగాణ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ టి.నర్సిరెడ్డి, మంకెన శ్రీనివాస్ రెడ్డి, డా.ఆదినారాయణ,డా. కేశరాజు రాంప్రసాద్ ,కలిదిండి విశ్వనాథ రాజు, ఇప్పలపల్లి చంద్రహాస్,బడేసాబ్ ,రాజు, శ్రీమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు