ఇదీ ఈ మనిషి......! :- కోరాడ నరసింహా రావు
ఏడాది కి.... ఆరంభం
  ( జనవరి)  ఒకటవ నెల ఒకటవ తేదీ...! 

 ప్రతీ నెల ప్రారంభం... 
   ఒకటవ తేదీ తోనే...! 

  వారానికి ఏడు రోజులు మొదలయ్యేది... 
 ఒక ఆదివారంతోనే...! 

24 గంటల రోజు మొదలయ్యేది ...వేకువ జాము 
సూర్యోదయం తోనే ! 

ప్రాణుల ప్రయానం మొద లయ్యేది... 
  పుట్టుక తోనే...! 
   ముగిసేది గిట్టుట తోనే!! 

ఏది మొదలైన.... 
  ఒక క్షణం తోనే...! 
  ఏమి జరిగిన.... 
   ఆ క్షణం లోనే...!! 

ఈ అనంత కాల గమనంలో... 
   మనిషి ఉ ని కీ... 
 క్షణ బంగురమే...!! 

క్షణం తో మొదలై... 
 క్షణం లో మాయ మయే 
  క్షణ బంగుర సృష్టి లో... 
  అనంత గమన కాలం తో పరుగులు... 
  కాలాన్నే జయించేయాలనే తపన ! 
  అన్నీ నేనే, అంతా నాదే అనుకునే భ్రమలో... 
అ శాస్వత మని తెలిసీ... 
శాస్వతత్వానికై  తాప త్రయం...!! 
  ఇది.... 
ఈ సకల సృష్టిలో నేనే మేధావిని అనుకుంటున్న ఈ మనిషి మూర్ఖత్వం...! 
    ******

కామెంట్‌లు