తెలుగు బాలలు..! తేనెటీగలు..!!: - కవిరత్న -సాహిత్యధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
తేనెటీగలారా..! 
ఓ తెలుగు బాలలారా..!!
నిర్భయులారా...
ఓ నిష్కల్మష హృదయులారా... 
నింగిలో మెరిసే ఓ నక్షత్రాల్లారా... 
నేలపై వికసించే ఓ పుష్పాల్లారా...

బాలలారా..!
ఓ భావిభారత పౌరులారా..!!
మీ అమ్మానాన్నల
ఆశలకు ప్రతిరూపాలూ మీరే... 
ఈ మాతృభూమి
భవితకు ఆరని దీపాలూ మీరే... 

బాలలారా..! 
ఓ భావిభారత పౌరులారా..!!
మీ తల్లిదండ్రుల
కలలు పండితే...బ్రతుకు పన్నీరే... 
కన్న ఆ కలలన్నీ కన్నీటి
అలలైతే... కంటినిండా కన్నీరే...

బాలలారా..! 
ఓ భావిభారత పౌరులారా..!!
మీరు దారి తప్పితే
అమ్మానాన్నలకు
అమృతం బదులు
హాలాహలం పంచితే
నాడు మీరు కలుపు మొక్కలే...

బాలలారా..! 
ఓ భావిభారత పౌరులారా..!!
రేపు మీరు పెరిగి పెద్దవారైతే
మీ అమ్మానాన్నలు వృద్ధులైతే
ఆకలెరిగి వేళకింతన్నం పెడితే... 
చిరునవ్వుతో ప్రేమతో పలకరిస్తే... 
ఆప్యాయతతో‌ ఆలింగనం చేస్తే...
రేపు మీరు ఎదిగే పూల మొక్కలే...

బాలలారా..!
ఓ భావిభారత పౌరులారా..!!
మీరు జ్ఞాన జ్యోతులే...
మీరు రక్షణ కవచాలే...
అందుకే మీరు ఆశాదీపాలై వెలగండి 
కానీ,కన్నవారికి శాపాలుగా మారకండి..

బాలలారా..!
ఓ భావిభారత పౌరులారా..!!
రేపు మీరు తారాజువ్వలై ఎగరాలి
నిప్పు రవ్వలై రగలాలి 
రణభేరి మ్రోగిస్తూ రణశూరులై...
అశాంతికి చెక్ పెట్టాలి...
అవినీతిని మట్టు పెట్టాలి...

బాలలారా..!
ఓ భావిభారత పౌరులారా..!!
మీరు అన్యాయాన్ని చీల్చే...కత్తులే...
మీరు చీకటిని పారద్రోలే...కొవ్వొత్తులే...
మీరు ప్రేమను పంచే...పూలగుత్తులే...
మీరు వీరులే, శూరులే, విశ్వవిజేతలే...

బాలలారా..!
ఓ భావిభారత పౌరులారా..!!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా...
తిలకిస్తూ త్రివర్ణపతాకం
ఎగరాలి మీరు శాంతికపోతాలై...
ఆలపిస్తూ వందేమాతరం
ఎదగాలి మీరు ఎవరెస్టు శిఖరమంత..!
వినిపిస్తూ దేశ ఘనకీర్తిని విశ్వమంత..!

 


కామెంట్‌లు