ఆయన స్కాట్లాండుకి చెందిన జాతీయ కవి. పేరు, రాబర్ట్ బర్న్స్ . ఆయన ఓ రైతు కూడా. చిన్నప్పటి నుంచే అష్టకష్టాలు పడి పెరిగారు. ఆయన స్కాటిష్, ఇంగ్లీష్ భాషలలో కవితలు రాశారు. 1759 జనవరి 25వ తేదీన పుట్టిన బర్న్స్ 1796 జూలై 21న మరణించారు.
ఆయన ఓ రోజు థేమ్స్ నదీ తీరాన షికారు చేస్తున్నప్పుడు ఆ నదిలో ఒకరు మునిగిపోతుండటం కంటపడింది. వెంటనే బర్న్స్ మరి కొందరి సాయంతో నదిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడారు.
ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కోటీశ్వరుడు. కానీ అతను మహాపిసినారి. అతను స్పృహలోకి రావడంతోనే తన దగ్గరున్న సంచిలోంచి ఓ పెన్నీ నాణం తీసి తనను కాపాడిన కవి బర్న్స్ కి ఇచ్చి ధన్యవాదాలు చెప్పారు. అది చూసి అక్కడే ఉన్న మరికొందరు ఆయనపై ఆగ్రహావేశాలతో మాటలు రువ్వారు. అయితే బర్న్స్ వారిని వారించి ఆయనమీద విరుచుకుపడకండి. అది మీకే అవమానం. ఆయన ప్రాణం ఖరీదంతే అని ఆయన ఈ పెన్నీతో నిరూపించుకున్నారు....కనుక శాంతించండి అని చెప్పారు.
అప్పుడు కోటీశ్వరుడి సిగ్గుతో తలవంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి