కలలు అలవాటు చేసేలా..
వేదన నిండిన మనసుకు
ఎదురొచ్చిన వేడుకలా...
మూగిన బాధలకు దొరికే
ముచ్చటైన ముగింపులా..
పాళీకి అందని ఖాళీ ని
పూరించే తోడులా...
ఆరాటాలతో పోరాడి
అలసిన మనసుకు సాంత్వనలా
అలజడి నిండిన మదికి
నిలకడ నిచ్చే కబురులా...
అసహాయంగా నిలిచిన వేళ
అనుకోని చోట దొరికే సాయంలా..
అన్నీ తెలుసనుకునే
ఏమీ తెలియని అజ్ఞానానికి పాఠంలా...
మాయ కమ్మిన మనసుకు
పొరలు తీసి చూపే గురువులా...
పాపమో శాపమో ఎరుగని
మోయలేని బాధలు మాయం చేసె
ఔషధంలా
తలచిన మేరకు తానై
పిలిచిన పలికే నేస్తమై......
మంచి చెడులను ఎంచి నడిచే
విచక్షణ నిచ్చి కాపాడే దైవంలా..
ముంగిటికొచ్చి కుశలమునడిగే
బంగరు వెలుగుల వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి