ఈ మధ్యనే "మెలొడీస్ ఆఫ్ లైఫ్" ఇంగ్లీష్ అనువాద పుస్తకం చదివాను. చదివాక దీని గురించి రెండు మాటలు మీ అందరితో పెంచుకోవాలని అనిపించింది.
ముందుగా అసలు ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ ఎందుకు చదవాలో చెబుతాను.
* జీవితం మనం అనుకున్నట్లు జరగదు. దేవుడు తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. లెక్చరర్ లేదా సైన్టిస్ట్ కావలసిన కుర్రాడు ఒక నాటు పడవ వల్ల జర్నలిస్ట్ అయ్యాడు.
* పుట్టుక నుంచీ ఎన్నో కష్టాలు మరెన్నో నష్టాలు వచ్చినా స్థిర చిత్తంతో ముందుకు సాగుతూ అడుగు పెట్టిన ప్రతి రంగంలో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు.
* సరదాగా సాగిన రచనలో పలు చోట్ల వ్యక్తిత్వ సూత్రాలున్నాయి.
* సామాన్యనిగా ఉంటూ అసమాన్య ప్రజ్ఞ చూపిన కుర్రాడు తాను వ్రాసిన ప్రతి అక్షరం లో బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నాడు. “ఇద్దరమ్మలు” అంటూ వ్రాసిన భాగం తప్పక చదివి తీరాలి.
* మన పల్లెలు 1950 నుంచి 1990 వరకు ఎలా ఉన్నాయో చెబుతూ, ఆ నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలను స్పృశించిన తీరు నన్ను ఆకర్షించింది.
* 40 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం, సమాజాన్ని తనదైన కోణంలో చూసిన తీరు, రచనలో తనకంటూ ఏర్పరుచుకున్న శైలి , సహజత్వం, నిజాయితీ, అమాయకపు పోకడ … వెరసి ఈ పుస్తకం చదువుతుంటే కొన్ని చోట్ల మనకు మనమే కనబడతాము.
* నేటి తరం పిల్లలకు ఐదారు దశాబ్దాల క్రిందటి జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత.
* ఈ కాలం తెలుగు వారి పిల్లలు చాలా మంది తెలుగు మాట్లాడుతున్నా చదవలేరు. అలాంటి వారి కోసమే ఎంతో శ్రమకోర్చి జీవనరాగాలు -1 పుస్తకాన్ని ఇంగ్లీష్ అనువాదంగా Melodies of Life -1 పేరుతో తీసుకొచ్చారు రచయిత.
* తెలుగు వారే కాదు, అన్ని ప్రాంతాల వారు చదవతగిన పుస్తకంగా అనువాద ప్రక్రియ సమయంలో శ్రద్ధ తీసుకున్నారు.
* ఈ పుస్తకం కొని చదవండి. సందర్భం ఏదైనా సరే ఈ పుస్తకాన్ని బహుమతి రూపంలో కానీ లేదా జ్ఞాపకంగా కాని పంచిపెట్ట వచ్చు . మంచి రచనలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వండి. చేతిలో పుస్తకం తీసుకుని చదవడం ఎలాంటిదంటే ఎక్కడో దూరాన ఉన్న మన పిల్లలు ఆన్ లైన్ లో చూడటం కంటే నేరుగా మన ఇంటికి రావడం లాంటిది.
* పుస్తకం కావలసిన వారు నేరుగా రచయితకు కాల్ చేయవచ్చు .
* రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కాంటాక్ట్ నెంబర్ 9885292208 (వాట్సప్ మరియు గూగుల్ పే నెంబర్)
అసలు ధర : ₹ 405
స్పెషల్ ఆఫర్ : ₹ 250
పోస్టల్ ఛార్జెస్ : లేవు.
(ఫిబ్రవరి నెల వరకు మాత్రమే)

| ఒకవేళ ఈ పుస్తకం తెలుగు లో చదవాలని అనుకుంటే "జీవన రాగాలు-1" కోసం రచయితను సంప్రదించండి. |
(ఫిబ్రవరి నెల వరకు మాత్రమే)
| పోణంగి బాల భాస్కర్ |
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి