ప్రతిభా దేవీసింహ్ పాటిల్:- అచ్యుతునిరాజ్యశ్రీ

 మనదేశతొలి మహిళారాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ప్రతిభాపాటిల్ 19డిసెంబర్ 1934లో జలగావ్ లో పుట్టారు.తండ్రి నారాయణ రావ్ పాటిల్ ధనిక రాజ్ పుట్ కావడంతో కూతురిని బాగా చదివించాడు.ఆమె ఎల్.ఎల్.బి.పాసై జలగావ్ లో వకీలుగా పేరుప్రఖ్యాతులు గడిచింది.భర్త దేవీసింహ్ రణసింహ్ శెఖావత్. సమాజసేవతో పాటు మహిళల అభ్యున్నతికై కృషిచేసిన ఆమెకు ఓకొడుకు ఓకూతురు.27ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో అడుగెట్టి1962_85  దాకా మహారాష్ట్ర ఎం.ఎల్.ఏ.గా విజయం సాధించిన వనిత. విభిన్న మంత్రిపదవుల్లో రాణించిన ఆమె ఇందిరాకాంగ్రెస్ ని వీడలేదు.ఇందిరాగాంధీకి నీడలో ఉండి1985 లో రాజ్యసభ లో ప్రవేశించిన ఆమె 1991లో లోక్సభ లో సభ్యురాలిగా ఎన్నో సంక్షేమ సంఘాలకు చేయూత నిచ్చారు.ఆపై రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నారు.అక్కడ సి.ఎం.వసుంధర రాజే! ప్రధాని మన్మోహన్ సింహ్ కాలంలో25జులై 2007లో న ఆమె రాష్ట్రపతి గా చరిత్ర సృష్టించారు.🌹
కామెంట్‌లు