విద్యార్థులంతా నూతన సంవత్సరంలో మరిన్ని సత్ఫలితాలు సాధించాలని పాలఖండ్యాం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. అందుకు అనుకూలమైన పరిస్థితులను ఆకాంక్షిస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పల్కుతూ నిర్వహించిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. ఎన్నో మధురస్మృతులనందించిన గతేడాదికి వీడ్కోలు చెబుతూ, ఆ సంవత్సరంలో పొందే ప్రతీ ఘనతనూ స్పూర్తిగా తీసుకుని పయనించాలని ఆర్.ఎల్.కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముగ్గులు, గ్రీటింగ్ కార్డుల తయారీ, పాటల పోటోల్లో విజేతలుగా నిలిచిన డొప్ప రాజేశ్వరి, చిర్రా అమృత, డి.నాగేంద్ర, గోక పృథ్వి, గోక కార్తీక్ లకు బహుమతులను అందజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారిని పలు కానుకలతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నూతన సంవత్సర సత్కారం గావించారు. గ్రామంలో పలువురు ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు.
పాలఖండ్యాంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి