*****
"అవ్వా! యమ యాష్టకొచ్చింది తెలుసా! ఊపిరి మెసల్లేదన్కో !దసరా తాతీలు వొచ్చిన కానుండి పొల్లగాండ్లు ఉన్న సోట ఉండుడు లేదు. సెప్పిన మాట యినుడు లేదు. ఒక్క తీర్గ సుడిబడేత్తుంటే పెద్దోడు అందరికి గలిపి రామప్ప,ఏయి తంబాల గుడి,లక్నోరం శెరువు పయాణం పెట్టిండు.
ఇంగ జూస్కో అవ్వా! కూడాయి జక్కాయి కలిసి ఇర్వై మందిమి అయినం.
మంచి పని జేశిండ్రు శెల్లే. పిల్లగాండ్లకి గిట్ల తిర్గుడు మస్తు కుషాలుగుంటది. గిట్లాంటి పయణాల్లో ఎన్కటి కట్టడాలు వాటి గొప్ప తనం తెలిశేలా పిలగాండ్లకు శిన్నప్పటి నుంచే సూపిత్తే బోలెడు సంగతులు తెలుత్తవి.
అవునవ్వా! పోయిన కాడల్లా గా బొమ్మ ఎంత బాగుంది.ఎవరు శెక్కిండ్రు. గీ బొమ్మ అచ్చం మడిషిలాగనే ఉంది అనుడు గవ్వీటి పక్కన జేరి మురిపెంగా పొటువాలు దిగుడు జేశిండ్రు.గా లక్నో వరం కాడైతే పట్టనలవి కాలేదన్కో... అక్కడ గా శెరువుల లాంచీల ఎక్కి,గది తిరుగుతుంటే సొరగం కనిపిచ్చిందనుకో ...
ఇంకేంది పిల్లగాండ్లకి గీ తాతీల్లు మస్తు కలిశొచ్చినయ్. గీళ్ళని మీరు బాగనే సుతలాయించిండ్రు శెల్లె!
అవునవ్వా!పర్మానందయ్య శిష్షులొతికే త్యేప త్యేపకి గాళ్ళని లెక్కబెట్టుకొనుడే సరిపోయింది.ఇంకో సంగతి తెల్సా అవ్వా! గీళ్ళకి యింట్లె తానం గీనం శెయ్యకుండా ఏం తిననీకి బెట్టం.గయ్యాల అద్దెకి తీస్కున్న గదిల నీళ్ళు సరింగ రాలె.గందుకని పెద్దోళ్ళం జేసి పిల్లగాండ్లకి కాల్జేతులు కడిగిచ్చి తీసికెళ్ళినం.
ఇంగ జూస్కో మీరు గిట్ల శుబ్బరం జెప్పిండ్రు గట్ల జెప్పిండ్రు.గిప్పుడేమో తానం చెయ్యకుండనే తినమంటుండ్రు తాగమంటుర్రని అని ఒకటే ధూం జేసుడు. "ఒరే వారీ! ఒసె బంగారీ! ఈలునుబట్టి ఉండాలె తప్పదంటే ఇననంటే ఇనుడు లేదు.గాళ్ళకి శెప్పే తల్కి"తల్కాయ పానం కాళ్ళకొచ్చింది".గిట్ల మేం జెప్పినవి మాకే అప్పజెప్పుడు..
అంటే "అయ్యోరి జందెం అయ్యోరికే ముప్పు" అన్నట్టయిందా శెల్లే!
ఆవునవ్వా
గదంత ఇన్న భూలచ్మి బుడ్డోడు ఇద్దరొక్కపావ అవ్వ పక్కన జేరి అవ్వా అవ్వా! బలేగుగా ముచ్చెటేందో జెప్పవా ?అడిగిండ్రు.
కొన్ని కులాల అయ్యోర్ల వొంటి మీద జందాలు ఉంటయి.గది ఆళ్లకి శిన్నప్పుడు ఓ పండుగ జేసి ఏత్తరు.గదాన్ని ఎప్పుడూ వొంటి మీద ఉంచుకోవాలె.కొంత మంది తానం చేసేటప్పుడు జందాన్ని ఈపుల అటిటు కదిలిత్తరు.గట్ల ఒకాయన నదొడ్డున తానం జేస్కుంట రొండు శేతుల్తో దాన్ని అటీటు అంటుంటే గొంతుకు బిగుసుకుందట.ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయితుంటే గా సైమంల ఒకాయన గజ్జూసి గబ్బ గబ్బ దెగ్గరకొచ్చి జందాన్ని తన తానున్న శిన్న కచ్చాకుతో సర్ర సర్ర కోశిండట.
"ఇంకాత్తుంటే పానమే పొయ్యేది అయ్యగారూ! మీ జెందమే మీకు ముప్పైంది". అన్నడంట.అగ్గో గప్పన్నించి గీ సామెత అందరి నోళ్ళల్ల నానుడు మొదలైంది.
గందుకేరా మనం జెప్పిన మాటలు మనకే తగిలేట్టు ఎదుటోళ్ళు శెబితే గీ సామెతని ఉదార్నగా అంటుంటరన్న మాట.
గదండీ సంగతి " అయ్యోరి జందెం అయ్యోరికే ముప్పు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి