గోమాతకు భగవాన్ కృప: - - యామిజాల జగదీశ్
 భగవాన్ రమణమహర్షి గోమాత లక్ష్మి పట్ల అపారమైన ప్రేమను చూపించేవారు. ఆయన ఆవును ఇతర భక్తులలాగానే చూసుకున్నారు
లక్ష్మీ అనే ఈ ఆవు‌ఎటువంటి వివక్షా లేకుండా మానవుల ఆనందం, ప్రేమ కరుణను పొందింది.
ఇది 1942లో రమణాశ్రమానికి వచ్చింది. అప్పుడు అది ఆరు నెలల దూడగా ఉండి 1948 వరకు ఇక్కడే జీవించింది.
అంత్యదశలో అది తన శారీరక బలాన్ని కోల్పోయి పడుకునేది.
ఒకరోజైతే అది లేచి నిల్చోలేకపోయింది.
భగవాన్ రమణ మహర్షి
దాని పక్కనే కూర్చుని దాని తలను తన ఒడిలో పెట్టుకున్నారు.
ఆయన దానిని ఆప్యాయంగా లక్ష్మి, లక్ష్మి అని పిలిచారు.
ఆయన దాని శరీరంపై తన చేతులతో  రాస్తూ కరుణా వర్షం కురిపించారు.
భగవాన్ దానిని తాకిన కొన్ని క్షణాలకే అది ప్రాణం విడిచింది. 
దానికి స్నానం చేయించి, పసుపు పూసి, శిరస్సున కుంకుమ బొట్టు పెట్టి దాని మెడన పట్టు వస్త్రం కప్పి దానిని పాతి పెట్టారు
భగవాన్ కృపతో, ఆదరంతో, ప్రేమతో
ఆ గోమాత విముక్తి పొందింది. ఈ గోమాత సమాధిని రమణాశ్రమంలో ఇప్పటికీ చూడవచ్చును.


కామెంట్‌లు