అంతరిస్తున్న వృక్ష జంతువుల గూర్చి చింత ఏల?
కూలుతున్న భవనాలకై కుములుటేలా?
ఎదమీద ఎదపెట్టి నాసొదంతా ఇనుకో
ఇనుకునిగార్దభస్వరంతో ఇంపుగా
పాడుకో
జన్మజన్మకీ సెల్లు చిల్లి పెట్టినా
కంటి కాడ,నోటికాడ అంటించుక
మస్తు మస్తుగా ఖుషీ చేయి
కంటి డాక్టర్ కాడ బీట్ వేయి
చావు పుటక చేతిలోనిగన్ను
పెన్ను పెన్సిల్ మాయమాయే
కావాలంటే పిల్లలు,వద్దనుకుంటే
పెంచుకో పిల్లులు
కుక్క కాటుతో మనిషి చచ్చినా
మా కుక్కను ఏమైన అంటివా
బొక్కలిరగదీసి బందీఖానాలో వేస్తాం
ఇదే కలికాలం నేటి నీతి
భ్రష్టుపట్టుతున్న జాతి😄

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి