భగవాన్ రమణ మహర్షి హాస్య ప్రియులు. సమయోచితంగా మాట్లాడే సమతుల్య నిపుణులు. అజ్ఞానులకు కూడా కరుణతో అర్థమయ్యేలా చేసే వ్యక్తిత్వం కలిగిన మహర్షి.
తన భక్తుల హృదయాల్లో సరళమైన రీతిలో, హాస్యాన్ని జోడించి లోతైన, సూక్ష్మమైన సత్యాల తత్వాన్ని పొదిగే వారు శ్రీ రమణులు.
ఆయన హాస్యం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుండేది. ఆయన చెప్పే మాటల్లో హాస్యంతోపాటు సలహాలూ పొందు పరిచేవారు.
ఆయన కవితలు అత్యున్నత స్థాయిలో ఉండేవి. దీనికి గొప్ప తార్కాణం - అరుణాచల అక్షరమణ మాల! బ్రహ్మజ్ఞాన సాధకులకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికోసం, శివసాక్షాత్కార మహా ప్రాప్తికోసం ఆయన అనుగ్రహించినదే ఈ అక్షరమణ మాల. ఎన్నో సంవత్సరాలు మౌనం వహించి నిర్వికల్ప సమాధిలో విజయాన్ని సాధించి, తన హృదయాంతరంగాన్ని, పరమశివుడిపై గల అనురాగాన్ని, దివ్య ప్రేమ విరహాన్ని రమణులవారు 108 ద్విపదలలో కూర్చిన అపురూప రచనే ఈ “అరుణాచల అక్షరమణ మాల!!
ఆయన చెప్పే వాటిలో తత్వంతో కూడిన సత్యం ఉండేది.
భగవాన్ మోకాలి సమస్యతో బాధపడుతుండే వారు. కాబట్టి ఆయన తైలం పట్టించే వారు. ఒకరోజు, ఆయన తైలం పూసుకుంటూ..."నేను నూనె రాసుకోకపోతే, ఈ బండి (శరీరం) పరుగెత్తదు," అన్నారు.
రమణులవారికి మోకాళ్ల నొప్పి ఉండటంతో, కొందరు భక్తులు తరచుగా ఆయన కాళ్లు పట్టేవారు.
భగవాన్ కాళ్లు పట్టుకుంటే పుణ్యం వస్తుందని భావించి భక్తులు ఈ విషయమై ఒకరితో ఒకరు పోటీ పడేవారు. దీన్ని గ్రహించిన భగవాన్ రమణ మహర్షి ఒకసారి తన కాళ్లు పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తితో ఇలా అన్నారు...
"ఒక్క క్షణం ఆగు! పుణ్యమంతా నీకొక్కడికేనా? దయచేసి నన్నూ ఈ కాలు పట్టుకుని పుణ్యం పొందనివ్వు" అని!
ఈ మాటతో హాలు హాలంతా నవ్వులతో నిండింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి