కొత్త వత్సరం :- నామ వెంకటేశ్వర్లు,- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐటిపాముల, నల్గొండ జిల్లా,
  వస్తుంది వస్తుంది కొత్త సంవత్సరం 
 ఏం తెస్తుందో ఏం చేస్తుందో 
వేచి చూద్దాం ఈ సంవత్సరం
 వరుణుడు కరుణించి 
 అవనని దీవించి
 పచ్చని పైరులను పండించి 
 పట్టడన్న అందిస్తుందో 
 ఆ పైరులని హరించేస్తుందో  
                            "కొత్త "
 ఆడంబరాలని ఆపించేసి 
 భిక్షాటనను భగ్నం చేసి 
 కరువు కోరలని కత్తిరించి 
 ఆకలి కేకల్ని అదుపు చేస్తుందా
 అధ:తాళానికి నెట్టేస్తుందో 
                          "కొత్త "
 ఆగిన మగ్గాలను ఆడిస్తుందా
 సహకారం వారికందిస్తుందా 
 అర్ధనాథాల్ని ఆపేస్తుందా 
 లేక సర్దుకొని జారిపోతుందో 
                     "కొత్త "
చెడును చెరసాలకు సాగనంపి
అన్యాయాన్ని నిలదీసి............. 
న్యాయం మనకు అందించి 
మనిషిని మంచిగా మారుస్తుందా 
 లేక మసక బారి పోయేస్తుందా
                        "కొత్త "
 దగాకోరు దందాలపేసి
 దోచుకున్న డబ్బు తెచ్చేసి
 పేద ప్రజలందరికీ పంచబడుతుందా  
 భారతదేశ రుణం తీర్చేసి,       
 దారిద్రాన్ని చెరిపేస్తుందో 
               "కొత్త "
 ఆక్రమించిన ఆస్తులు తీసేసుకుని 
 అక్రమాలన్నీ అరికడుతుందా 
 అణగారిన వారిని ఆదరిస్తుందా 
 లేక వారికె కొమ్ము కాచేసేస్తుందో 
                     "కొత్త "
 చెప్పే మాటలకు,                           
 చేసే పనులకు పొంతనలేని            
కల్మష రాజకీయాలను కట్టడిచేసి      
 దేశ సంపదను తెప్పించేసి     
ప్రజలందరికి పంపిణీ చేసి 
ప్రజల కష్టాలను తీర్చేస్తుందో 
లేక వారినే కాలగర్భంలో కలిపేస్తుందో 
                   "కొత్త "
 నిరక్షరాస్యతను నిర్మూలించి 
 అక్షరాస్యతను పెంచేస్తుం
 నిరీక్షణను తొలగించేసి 
 నిరుద్యోగాన్ని రూపుమాపుతుందో 
 లేక నడినిశిలోకి నెట్టేస్తుందో 
                  "కొత్త "
 కపట మోసాలు కట్టించేసి
 కల్మషాలను కాటికి నంపి 
 కాగడలా వెలుగునిస్తుందో 
 దాన్నే ఎల్లకాలం కొనసాగిస్తుందో
                    "కొత్త "
 ఇంకా ఇంకా ఎన్నెన్నో 
 అర్తనాదాలు ఆక్రందనలు 
 అల్లరి మూకల చిల్లర చేష్టలు 
 రాబందుల రెక్కల చప్పుడు
 ఆపేస్తుందో కొనసాగిస్తుందో
 వేసి చూద్దాం ఈ సంవత్సరం 
                  "కొత్త "

కామెంట్‌లు