సామెత-116,: .అశుద్ధంలో రాయేస్తే అంతా మీదనే చిల్లినట్టు.
****
"శీ ! శీ ! శెవ్వా ! ఏం మనిషి! నోరు తెరిస్తే కంపే! ఒక్కటన్న ఆయిమన్న మాట మాట రాదు. తాయికి దగ్గట్టు ఉండేది లేదు. గిస్మంటోళ్ళను జూత్తుంటే గాళ్ళకొచ్చిన పదవులు ఎదవలకి వొచ్చినట్టే అన్పిత్తయి. మనిషన్నాక కూసింతన్న ఇంగితం ఉండొద్దా?".
"కాత్త పెద్దిర్కం ఉంచుకోవాలని తెల్వదు. ఏమన్న మాట్లాడితే కంపల బడ్డ కుక్క లెక్క కయ్యి కయ్యి మని అర్సుడు దప్ప."
"ఏంది శెల్లె? ఎవలా పెద్ద మడిషి? బాగనే ఏకుతున్నవు గద! గింతకి ఏమయ్యింది?"
"ఏమవ్వుడేందవ్వా!మన సాయిలు శెల్లె విజిత గీ నడ్మల ఏన్నీళ్లకి సన్నీల్లొతికె ఆసరని ఓ పెద్ద కంపెన్ల గదేదో పరీచ్చ పాసై పనికి కుదిరింది. గా కంపెని పెద్ద యజమాని కింద పన్జేసే మేనేజరు ,గాయన కింద కొందరికి ఒక గుంపు నాయకుడు ఏమేం పన్లు చెయ్యాలో గీళ్లందర్కి శెప్తడంట. ఏం అవసరమొచ్చినా, ఏదన్న అర్తం కాకపోయినా గాయన్ని అడ్గితే మంచిగ యిడమర్సి శెబుతడంట" పనొత్తిడి వున్నా గా గుంపు నాయకుని పున్నేనా మంచిగనే చేత్తుందట.
గట్ల ఎవలేం గావాలన్న గాయన్నే అడుగుడు, పనేదన్న మొదల్వెట్టుడు జూసి గా యజమాన్కి కన్నెర్రయింది. గా నాయకుని వల్ల కంపినికి మంచి జర్గుతదన్న సోయి లేక పన్జేసేటోళ్ళ మీద నోరు పారేసుకునుడట.
గాళ్ళకి గీ నడ్మల వొన భోజనాలు పెట్టిండ్రంట. అందరు కలిసి తలో పని జేస్కుంట గుంపు నాయకుని అడుగుడు జూసి మొగమంత అడ్డెడు పేలాలు ఏయించుకోవచ్చు అన్నట్టుగ మొగం బెట్టిండంట. గీ విజిత గుంపు నాయకుని మంచితనం గురించి చెప్పబోతుంటే తట్టుకోలేక ఇట్టమొచ్చినట్టు అనడం మొదలు వెడుతుంటె 'గదేంటి మంచి వారే కదాని' చెప్పబోతుంటే ఇంగ నోటికొచ్చినట్లు మాట్లాడింట గా మేనేజరు."
" గిప్పుడు నీనేమన్న సారు? అని నెమ్మదిగా అంటుంటే మరింత రెచ్చిపోయి ఏవేవో అతిగ మాట్లాడిండంట. "అత్తా! పొద్దు పొద్దున్నే ఎవలి మొగం జూషిన్నో" అని గా బాదంత జెప్పుకుని ఉజ్జోగం మానేత్త అంటుంది అవ్వా!
ఇగ్గో శెల్లె! అశుద్ధంల రాయేస్తే మీద ఎట్ల శిల్లుతుందో గిస్మంటోళ్ళు సుత అంతే. అశుద్ధమష్మంటోళ్ళు. గాళ్ళ జోలికే పోవద్దు. పోవాల్సొస్తే మనమేం జెయ్యాలో గది జేయ్యాల్సిందే.
" మా తమ్ముడు ఎలుతు డిపాటుమెంట్ల పన్జేసేటోడు గాళ్ళ డాకటరు గిట్లనే నోరు కంపు. ఏదో ఒకటి అనేవాడంట. ఒక పాలి ఓ సిస్టరును ఏదో అంటే మా తమ్ముడిని సలా అడిగిందట.
"గట్లో నాడు! సెలవు గావాలెనని చీటీ ఇయ్యనీకీ గదిలకు బోతే ఏదేదో వాగడం మొదలు బెట్టిండంట మా తమ్ముడి మాటలు యాదికొచ్చి ఈ శెంప ఆ శెంప టప్పటప్ప ఆయించి వొచ్చిందంట. గట్ల గా సంగతి ఎవలికి శెప్పుకోలేక గప్పన్నించి మంచోడు అయ్యిండంట. గట్ల జేయాలే శెల్లె! ఆడి కోసం మనమెందుకు ఉజ్జోగం వొదులు కోవాలే?
గదండీ సంగతి " అశుద్ధంల రాయేస్తే అంతా మీదనే జిల్లినట్టు" జేసే మడుసులు ఉంటరు. జాగర్తగ ఉండాలె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి