ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కీ.శే.గొర్లి నరేష్ నాయుడు మెమోరియల్ పార్క్ ను ప్రారంభించారు. ఆయన సొంతూరు చినకుదమ గ్రామంలో నరేష్ నాయుడు స్మృత్యర్థం వారి కుటుంబ సభ్యులచే నిర్మితమైన పార్కును ఆయన ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకు అధికారిగా ఆదర్శవంతమైన సేవలను అందిస్తూ, వ్యాధి సోకి అసువులు బాసిన గొర్లి నరేష్ నాయుడు జ్ఞాపకార్థంగా ఈ పార్క్ ఏర్పడడం గొప్ప సంకల్పంతో కూడిన విషయమని అన్నారు. స్వర్గీయ రమేష్ నాయుడి కుటుంబీకులు ఎంతో విలువైన ప్రదేశాన్ని ప్రజలకోసం పిల్లల వినోదం కోసం పార్క్ స్థలదాతగా నిలిచి గొప్ప త్యాగం చేసారంటూ వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను ఆయన అభినందించారు. అదేవిధంగా చినకుదమ యువత ఆధ్వర్యంలో నవ యువత కదలివచ్చి ప్రత్యేక శ్రద్ధ వహించి, అహర్నిశలూ శ్రమించి ఆర్ధిక పరిపుష్టి చేకూర్చి నిర్మాణ బాధ్యతలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆ యూత్ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు తెల్పుతూ ధన్యవాదాలు తెలుపుతున్నానని రామకృష్ణ అన్నారు. పెదకుదమ, గదబవలస గంగరాజ పురం, చినకుదమ గ్రామాలతో కూడిన కుదమపంచాయతీ ప్రజల తరఫున, పొరుగూరు గౌరీపురం గ్రామ ప్రజల తరఫున మిక్కిలి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అన్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు డొంకాడ మంగమ్మ జ్యోతి ప్రజ్వలన చేయగా, నరేష్ నాయుడు చిత్రపటానికి సర్పంచ్ చెరుకుబిల్లి గిరి పూలమాలాలంకరణ గావించిరి. దివంగత నరేష్ నాయుడి తల్లిదండ్రులు గొర్లి రవణమ్మ, రామినాయుడు, భార్య కల్పన, కుమార్తె కీర్తి, తమ్ముడు శ్రీనివాస్, మరదలు భారతి, కుమార్తెలు సీతను, టీనాలు పాల్గొని స్వర్గీయ రమేష్ నాయుడి సేవలను ఆదర్శాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువజన సభ్యులు గొర్లి చిన్నంనాయుడు, పల్ల రాంబాబు, పల్ల సింహాచలం, మరడాన అప్పలనాయుడు, పి.భాస్కరరావు, మర్రాపు చిన్నం నాయుడు, పి.శ్రీనివాసరావు, పల్ల శివున్నాయుడు, పి.కృష్ణమూర్తి నాయుడు, పి.దాలినాయుడు, మరడాన జగన్నాథం నాయుడు, పి.కురిమినాయుడు, వాణిజ్య వేత్తలు మార్కొండ పట్నాయకుని గౌరీశంకరరావు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, కె.పరమేశ్వరరావు, కె.సత్యసాయిబాబా, కె.గోపి, యేగిరెడ్డి రామారావు, కె.రామ్ ప్రసాద్ పట్నాయక్, దినేష్, కుదమ మణికంఠ సాయి శ్రీనివాస్, ఎస్.కె.తరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. పార్క్ లో జారుడు బల్లలు, ఊయలలందు వందలాది మంది బాలబాలికలు పాల్గొని కేరింతలు కొడుతూ సంక్రాంతి సంబరాలతో పాటు ఆహ్లాదకరంగా గడిపారు.
గొర్లి నరేష్ నాయుడు మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి