****
అవ్వా! అవ్వా! మా బల్లె ఏడో తర్తి దినేష్ గాడు దినాం ఆడి వయ్యిల సంచిని వేరే ఆళ్ళతో మోయిత్తడవ్వా!
"గట్ల మన వత్తువులు ఏరే ఆళ్ళతో మోయిచ్చొద్దు గదవ్వా?"
గదే కాదవ్వా!మా బల్లె సార్లు పంతులమ్మలు ఎవలన్న ఇంటిపని ఇత్తరు గద! గవీటిని ఇంటి కాడ అస్సలు చేయడవ్వా! దోత్తులతో రాయిత్తడు.గట్ల చేయించొద్దు గదవ్వా?"
గట్లనే మా తర్తిలో బీమేష్ గాడుండవ్వా! గాడైతే బోర్డు మీద చేసిన లెక్కను బుక్కులో ఎక్కిచ్చుకోమంటే గట్లనే కూసుంటడు. ఇంగ నేను దబ్బ దబ్బ ఎక్కించుకుంట గద. గాడు నన్ను ఆని నోటు బుక్కుల ఎక్కియ్యమని అడుగుతడు. సారు జూసి గాన్ని కొడ్తడని చానా త్యేపలు నేనే ఎక్కిచ్చి పెడతవ్వా!"
అయినా ఓ పాలి మా సారు గాన్ని జూసి మస్తు తిట్టుకుంట' నువ్వు రాస్కోకుండ ఏరే ఆళ్లతో రాపిత్తవా?ఇంగ నీకు లెక్కలు రమ్మంటే ఎట్లొత్తయిరా!అని మస్తు గొట్టిండవ్వా!" అయిన గని గాడికి బుద్ధి లేదవ్వా!"
భూలచ్మి,బుడ్డోడు ఒకలి తర్వాత ఒకరు బల్లె ముచ్చెట్లు చెప్పుకుంట అవ్వ గియ్యాల మా సారు గస్మంటోళ్ళని తిట్టుకుంట" అంబలి తాగేటోనికి మీసాలెత్తేవాడొకడా?'అన్నడవ్వా? గదేందో అర్తం కాలె శెప్పవ్వా!"
గాళ్ళిద్దరికి "సరే చెప్త వినుండ్రి" అనుకుంట అనగనగా ఒక ఊల్లె శానామంది ఒళ్ళు ఒంగనోళ్ళు ఉండేటోళ్ళు! ఓ దినాము ఆ ఊరి సరుపంచి గాళ్ళలో చానా ఒళ్ళంగనోడు ఎవడో సూద్దామని పిలిత్తే అతి కట్టం మీద కొందరు వొచ్చిండ్రు.
గాల్లలో ఒకడికి వీపు గోకుడొచ్చింది".వాడు ""ఒరే కొంచెం గోకరా "అని పక్కోన్ని అడగడం జూసి" గీడే పేద్ద సోమరి పోతోడు" అనుకుని మీలో సోమరిపోతులందరూ శేతులెత్తండి అన్నడు.
గక్కడికొచ్చిన సోమరోళ్ళందరిల ఒక్కడు మాత్తరం శెయ్యి ఎత్తకుండ గట్లనే కూసుండు. "ఏందిరా శెయ్యి ఎత్తలేదు?"అంటే"కావాల్సుంటే మీరే దగ్గరికొచ్చి ఎత్తండి" అన్నడు. వార్నీ గీళ్ళందరిల వీడే పెద్ద సోమరి అని తేల్చి ,గట్ల సోమరితనం ఉండగూడదని రకరకాలుగ శెప్పి గాళ్ళని పంపిచ్చిండు.
గట్లనే ఒకడు అంబలి తాగుతుంటే మీసాలు అడ్డొత్తున్నయని ఇంట్లో పనోన్ని పిల్సి "మీసాల్ని లేపి పట్కో" మంటడు.గంత సోమరిపోతోడు అన్నమాట.గట్లాంటి వాళ్ళని జూసే గిస్మంటి సామెతలు బుట్టినయిరా!అనంగనే "బలే వుంది అవ్వా!" అన్నరు.
గదండీ సంగతి "అంబలి తాగేటోనికి మీసాలెత్తేవాడొకడు అంటే గిదే మరి
దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే అసలే పేదోడు కంటే అందుల వాడికో బంటునా? అనే అర్థంతో సుత ఉపయోగిస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి