టిబెట్ సాహిత్యంలో రామాయణం...: - సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 20వశతాబ్ది ఆరంభంలో చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో మొగావో గుహలలో పురాతత్వవేత్తలకు అసంపూర్ణంగా ఉన్న పాండులిపిలో రామాయణ అంశాలు కన్పడ్డాయి.8వశతాబ్దిలో టిబెటన్ భాషలో రాయబడినవి.బౌద్ధ రామాయణం,వాల్మీకి రామాయణం ఛాయలు లేవు.ఈటిబెటన్ రామాయణంలో కొన్ని విశేషాలు తెల్సుకుందాం.దశరథుడు అహ్రత్ ఆరాధన చేస్తే దేవతలు ప్రసన్నులై ఒక పుష్పాన్నిచ్చారు. మహారాణితో పాటు ఆఖరిరాణి కూడా దాన్ని వాసన చూడటంతో ఆమెకే ముందుగా రాముడు పుట్టాడు.మహారాణికి ఆతర్వాత లక్ష్మణుడు పుట్టాడు.ఎవరిని తన ఉత్తరాధికారిగా చేయాలనే మీమాంసలో పడ్డాడు దశరథుడు.హఠాత్తుగా ప్రాణం పోయింది .రాముడే సింహాసనమెక్కాడు. కానీ రాముడు పట్టపురాణి లక్ష్మణునికే రాజ్యభారం అప్పగిస్తే అతను నిరాకరించాడు. రామునిపాదుకలు సింహాసనంపై ఉంచి మంత్రిగా మారాడు.భరతుడు శత్రుఘ్నుడు వనవాసం ప్రస్తావనలేదు.జైనరామాయణంలో లాగా టిబెట్ సాహిత్యంలో కూడా సీత రావణుని కూతురని,జ్యోతిష్కుల సలహాపై అతను ఆపిల్లను రాగిపాత్రలో ఉంచి సంద్రంలోకి విసిరేశాడు.కాలువ తవ్వే ఓరైతుకి ఆపాత్రదొరికి ఆపాపను పెంచి పెద్ద జేశాడు. సీతారాముల పెళ్లి ఆపై రావణుని సోదరివల్ల వారివియోగంచెప్పబడింది.ఆమెపేరు శూర్పణఖ కాదు,ఫూర్ఫలా! బంగారులేడి,సీత లక్ష్మణుని నిందించటం, రావణుడు సీతను ఆమెకింద ఉన్న భూమితో సహా ఎత్తుకుపోటం అంతా తమిళరామాయణంలో లాగా సాగింది.సీత ను బలవంతంగా తాకితే తాను బూడిద అవుతాడనిభయం ఆదానవుడికి ఉంది.రాముడు సీతను వెతుకుతూ ఓనది దగ్గర ఆగి రక్తంతో నిండిన నదిని చూస్తాడు.వాలి వల్ల గాయపడిన సుగ్రీవుని రక్తం అని గ్రహిస్తాడు.
ఇక రాముడు వాలిని వధించిన విధానం మనకు వింతగా అనిపిస్తుంది.సుగ్రీవుడు తన తోకకి దర్పణం బిగించి వాలితో యుద్ధం చేస్తాడు.అప్పుడు వాలిని గుర్తుపట్టి వధిస్తాడు. ఇక మిగతా కథంతా మన రామాయణమే. ఈటిబెటన్ రామాయణంలో పత్రాలు అంటే లేఖలు ముఖ్య పాత్రవహించాయి. సుగ్రీవునికిరాముడు లేఖద్వారా హెచ్చరిక చేశాడు. అప్పుడే సుగ్రీవుడిలో చురుకు బెరుకు కలిగింది.హనుమ ద్వారా సీత కి సందేశం పంపాడు రాముడు.సీత కూడా హనుమతో తన లేఖను పంపింది.సుగ్రీవుడు చనిపోయాక, హనుమ రాజ్యంలో సంచరించేప్పుడు లేఖలు రాయవద్దని హనుమని ఆదేశించాడు రాముడు.వింతైన కథల పుట్ట.మనం మాత్రం వాల్మీకినే అనుసరించాలి🌹
కామెంట్‌లు