కృషి తెరవెనుక దాగివివాహమాడవిజయలక్ష్మిసిద్ధంగా ఉన్నదిరా..!శోకపు నీడల్లో దాగిసుఖం నిదురిస్తున్నదిరా..!ఏదీ తనంతట తానునీ దరికి రాదురాశోధించి సాధించాలిఅదే ధీర గుణంఅన్నారు మహాకవి శ్రీశ్రీ..!ఔనువిజయమైనాఘన విజయమైనాఅఖండ విజయమైనాఅది మంత్ర తంత్రాలమాయాజాలం కాదు..!అది అతీంద్రియ శక్తులఆశీర్వాదం అసలే కాదు..!అది నీ కసికి – కృషికినీ గట్టి పట్టుదలకునీ అంకితభావానికినీ నిర్ణయాల నిశ్శబ్దగంభీరతకుఅందే వరప్రసాదం..!నీ అకుంఠిత దీక్షకునీ ఆలోచనల పదునుకునీవు చూపే స్థితప్రజ్ఞతకునీ బహుముఖ నైపుణ్యానికిపొందే ప్రతిఫలం...!నీలోని నీతి – నిజాయితీకి,నీ నిర్మల నిశ్చల మనసుకు,నీవు పంచే నిష్కల్మష ప్రేమకు,ఈ సృష్టిలోని సకల జీవరాశులపైనీ సమదృష్టికి ఓ దివ్య దర్పణం.!నీ నిద్రను, ఆరోగ్యాన్ని,సమయాన్ని వెచ్చించినీవు కార్చే స్వేదబిందువులేనీ విజయానికి వజ్రకవచం..!నీ సద్బుద్ధికినీ సత్ప్రవర్తనకునీ సత్సంకల్పానికినీ అలుపులేని ఆచరణకు...నీ సాహసానికి నీతత్వానికినీ స్వచ్చమైన వ్యక్తిత్వానికినీలోని మచ్చలేని మానవత్వానికిప్రతిఫలం నీవు ఆర్జించేఅఖండ విజయం..!అందుకై వెనకడుగు వేయకపట్టువదలని విక్రమార్కునిలారామబాణంలా దూసుకుపోవాలి..!
సాహసం చేయరా డింభకా! : - కవిరత్న – సాహిత్యధీర-సహస్రకవి భూషణ్ -పోలయ్య కూకట్‌పల్లి, -అత్తాపూర్, హైదరాబాద్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి