(శుభ నూతన ఆశీర్వచనం...)
ఓ నా సాహితీ మిత్రులారా...!
ఓ సరస్వతీ పుత్రులారా..!
మీ కోసం"స్వాగతం" పలుకుతూ...
ఈ కొత్త సంవత్సరాన్ని నే కోరేదొక్కటే.....
మీ ముఖంలో
"చిరునవ్వుల వర్షం"
ప్రతి క్షణమూ కురవాలని...
"ఆనందపు తరంగాలు"
మీ ఎదకడలిలో ఎగిసిపడాలని...
మీ ప్రతిశ్వాసలో "ఆరోగ్యం
"ఆణిముత్యంలా" మెరవాలని...
సంతోషపు సుమాలు
మీ "జీవనతోటలో" విరబూయాలని...
కొత్త "ఆశయాల తోరణాలతో"
అడుగులేస్తూ ముందుకు నడవాలని...
ఈ ఏడాది ప్రతి దినం ప్రతి క్షణం
ఒక "వసంతగీతమై" వినిపించాలని...
ఓ నా సాహితీ మిత్రులారా...!
ఓ సరస్వతీ పుత్రులారా..!
మీ కోసం స్వాగతం పలుకుతూ...
ఈ కొత్త ఏడాదిని నేను కోరేదొక్కటే...
వేయి కొత్త వెలుగుల కాంతులు
మీ జాలి గుండెల్లో జ్వలించాలని...
మిమ్మల్ని కోటి శుభాల
"కొత్త దారిలో " నడిపించాలని...
మీ పెదవులపై "మెరిసే ప్రతిచిరునవ్వు"
ఒక "మధుర గీతంగా" మారాలని...
మీ ఆశలు మీ సాహసాలు
మీ పాదాలకు "దారిదీపాలు" కావాలని...
మీలో "కొత్తఆశలు" చిగురించాలని...
మీరు ఊహించని ఘనమైన
"విజయాల విందులను"
"మీకు రుచిచూపించాలని"...
"మీ జీవితం
"సంతోష సాగరంలో"
"నవ్వుల పువ్వుల నావగా"
"ముందుకు"సురక్షితంగా" సాగిపోవాలని..
"అది ఆనంద తీరాలను" చేరుకోవాలని...
ఏ మొండి రోగాలు
మీ ఇంటి
గడపను తాకరాదని...
ఆరోగ్యమే మీకు
"ఆరని జ్యోతి" కావాలని
మీరు తలపెట్టిన అన్ని శుభకార్యాలు
"విజయ దీపాలై" వెలుగులను
"విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ...
ఓ నా ప్రియ మిత్రులారా..!
ఓ సరస్వతీ పుత్రులారా..!
ఈ జీవిత సంద్రాన పుట్టునండి
ఎన్నో సుఖదుఃఖాల సుడిగుండాలు..!
గట్టెక్కిస్తే కృతజ్ఞతగా పెట్టండి
కొత్త సంవత్సరానికి కోటి దండాలు...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి