కరిగిన కనకపు ధారల
వెలిగిన గగనపు దారులు
నిలిచిన శిఖరపు అంచున
మెరిసిన దినకరు కిరణం
చీకటి నీడలు పొద్రోలి
రేపటి కాంతులు పంచాలని
వేకువ రాకను కోరి
వేచిన పుడమికి సంతోషం
ప్రకాశం ఎంత ప్రశాంతమో
ప్రభావం ఎంత ప్రధానమో
ప్రసారం ఎంత ప్రమోదమో
ప్రభాతం అంత పరమాద్భుతం!
కిలకిల నవ్వుల గువ్వల సడులు
గుసగుసలు చెబుతూ చుట్టూ తిరిగే
కొండగాలి వింజామరల మధ్య
నేలకు వేసే వెలుతురు వెల్లలు
ఎంత సుందరమైనదో
ఇంకెన్ని సొగసులు ఉన్నదో
అందాలు పొదిగిన ఈ జగతి
ఆ దైవమిచ్చిన బహుమతి
మనుగడ ఉన్నంత వరకే
మమకారమైనా అహంకారమైనా
మంచితనం పంచి పెట్టి
మనిషిగా మిగలమనే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి