రాష్ట్రస్థాయి కథా పోటీలలో అయ్యలసోమయాజుల ప్రసాద్ ద్వితీయ విజేత.

  ప్రముఖ  రాష్ట్రస్థాయి సాహితీ సాహిత్య  సేవాసంస్థ కవితాలయం ,కవుల నిలయం ఆధ్వర్యంలో అరుణోదయ సాహితీ కిరణాలు నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కథాపోటీలలో ప్రముఖకవి, రచయిత, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్   విశాఖపట్నం వ్రాసిన' కాలంతో బాటు మనం మారాలి' అనే సామాజిక స్పృహ కలిగిన కథను స్వీకరించి వ్యపస్థాపకురాలు డాక్టర్ కోదాటి అరుణగారు, గౌరవ అధ్యక్షురాలు సీనియర్ కవియత్రి డాక్టర్ కృష్ణకుమారి ( కృష్ణక్క ) నిర్వాహక సభ్యులు సాహితీవేత్త డాక్టర్ శ్రీ నాయకంటి నరసింహ శర్మ గారు ద్వితీయ విజేతగా ప్రకటించి శుభాకాంక్షలు తెలుపుతు  వర్చువల్ విధానంలో ప్రశంసా పత్రం నగపురస్కారాన్ని  అందచేసారు. బదులుగా  ప్రసాద్ మాష్టారు సంక్రాంతి సందర్భంగా తనకిష్టమైన కృష్ణక్క ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంధర్భంగా సాహితీమిత్రులు రచయితకు  అభినందనలు తెలియచేసారు.
కామెంట్‌లు