పేదవారి పుత్తడి "వెండి" :::- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) సారవకోట
ఒకప్పుడు వెండి వారికి నిధి పెన్నిధి..
నేడు ధరాఘాతంతో మండిపోతున్న వెండి..
వందలు, వేలు, లక్షలు దాటేస్తూ
కొండెక్కిపోయింది..
వెండి రేటు విని సామాన్యుల గుండె పిండైంది...
బంగారముతో జత కట్టిన ర"జత"ము.
బీదల బంగారం తృణమో పణమో కొనలేక
నేడు వారికి బరువై కరువైపోతుంది.

:: బంగారం - పెనుభారం ::
బంగారం సింగారంగా గారమైపోయింది..
కనకం ధర

పూనకం వచ్చి పెరిగిందేమో..
పుత్తడి కొనాలంటే ప్రజలు ఇత్తడై పోతున్నారు.
స్వర్ణమా సువర్ణమా నిమిషానికో ధరతో వర్ణమే సవరణమే..
పసిడి పసివాడికి కూడా కొని పెట్టలేని పరిస్థితి.
కొనాలన్నా కొండెక్కున్నావు..
పేదోడికి చేదోడుగా ఉండక..
లక్షల్లో లక్షణంగా కూర్చున్నావు.

కామెంట్‌లు