అయిదో ఏట వివాహం చేసుకుంది. ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. చదవడం లేదా రాయడం తెలీదు. ఆమె పేరే కోదైనాయగి. ఆమె తన మొదటి తమిళ నాటకాన్ని చెప్తుంటే ఓ స్నేహితురాలు రాసిపెట్టింది. అది ప్రచురించినప్పుడు అలనాటిఅగ్రశ్రేణి తమిళ వార్తాపత్రికలు తమ సమీక్షలలో దానిని తెగ ప్రశంసించాయి.
అది తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది.
అనతికాలంలోనే ఆమె తమిళనాడు లోని అత్యంత సంపన్న రచయిత్రులలో ఒకరిగా నిలిచారు.
ఆమె నుంచి అద్భుతమైన సాహిత్యం పాఠకలోకానికి అందింది.
ఈ క్రమంలోనే ఆమె అక్షర జ్ఞానాన్ని సంపాదించారు. అంతేకాదు, ఆమె ఏకంగా 115 పుస్తకాలు (నవలలు, నాటకాలు, చిన్న కథల సంకలనాలు) రాయడం, 35 సంవత్సరాలు ఒంటరిగా "జగన్మోహిని" అనే పత్రికను నడపడం, 6 నెలలు జైలు శిక్ష అనుభవించడం , 20వ శతాబ్దం మొదటి భాగంలో దేశం ఎదుర్కొన్న అనేక సామాజిక సవాళ్ల గురించి మాట్లాడటంతోపాటు వివిధ అంశాలపై రచనలు చేయటం గమనార్హం.
మద్రాసులోని తిరువల్లిక్కేణిలో గల పార్థసారథి ఆలయానికి సమీపంలో నివసించే సనాతన అయ్యంగార్ కుటుంబానికి చెందిన కోదైనాయగి (9 గజాల చీర ధరించే వారు) కలం నుండి సాహిత్యంలోకంలో సంచలనాత్మకమైనవిగా నమోదై ఆమెకు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టటం విశేషం.
1901 డిసెంబర్ ఒకటో తేదీన జన్మించిన ఆమె పూర్తి పేరు వై.ఎం. కోదైనాయగి. తమిళంలో తొలి డిటెక్టివ్ నవల రాసిన ఆమె 1960 ఫిబ్రవరి 20న తుదిశ్వాస విడిచారు.
ఆమె రచయిత్రి మాత్రమే కాదు. వక్త. కవయిత్రి. సామాజిక కార్యకర్త. పాత్రికేయురాలు. భారత స్వాతంత్య్ర సమర యోధురాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి