కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం గంగారం గ్రామసర్పంచి రేకుల జ్యోతి రఘు, ఇతర గ్రామ కార్యవర్గ సభ్యులతో కలిసి పూర్వ ప్రాథమిక విద్యా సామగ్రి పలకలు, డ్రాయింగ్ పుస్తకాలు, క్రేయాన్స్, బొమ్మలు ఇతర వస్తువులను పిల్లలకు పంపిణీ చేశారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం ప్రారంభమైన విషయం విదితమే. ఇటీవల ఈ కేంద్రానికి రూ.1.5 లక్షల విలువైన బోధనాభ్యాసన సామగ్రి వచ్చింది. గురువారం వాటిని పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి రేకుల జ్యోతి మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ఆమె పిల్లల చేత ఇంగ్లీష్ రైమ్స్ పాడించారు. పిల్లలు ఇంగ్లీషు రైమ్స్ అభినయం చేస్తూ చక్కగా పాడడంతో సర్పంచి, ఉపసర్పంచి, ఇతర వార్డు సభ్యులతో పాటు గ్రామ కార్యదర్శిలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి పాఠశాలలోని పిల్లలకు స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆటపాటలతో, భావనల (కాన్సెప్ట్) ఆధారిత విద్యాబోధన చేస్తున్నా మని, ఇది పిల్లల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుందన్నారు. కష్టించి సంపాదించిన డబ్బును వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఇంతకుముందు పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి ఆకారపు హరినాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచి రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచి మేడి అశోక్ గౌడ్ ఇతర గ్రామ పంచాయతీ కార్యవర్గం బాలుని చేత కేక్ కట్ చేయించి పిల్లల ఆనందోత్సాహాల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హరినాథ్ రెడ్డి చక్కగా చదువుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచి రేకుల జ్యోతి, ఉప సర్పంచి మేడి అశోక్ గౌడ్, వార్డు సభ్యులు చిక్కుల వంశీ, కూసలత, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, గ్రామ కార్యదర్శి షోయబుద్దీన్, విట్టం సంపత్, ఎడ్ల స్రవంతి, పేరెంట్ ఆకారపు ప్రతాపరెడ్డి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
'ఊషన్నపల్లి పాఠశాలలో విద్యా సామగ్రి పంపిణీ'
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి