గురుబ్రహ్మ గురుర్విష్ణు: మనకు తెలుసు.శ్రద్ధ భక్తి విశ్వాసం దైవం గురువుపై పెట్టకుంటే ఫలం పొందం. హనుమ మనకి ఆదర్శం.ఇక ధ్వజదత్తుని కథతెల్సుంటే అంతా విశదంఅవుతుంది. వేదశాస్త్రపారంగతుడు, ఇంట పస్తులు .భార్య బిడ్డలు ఆకులు కూరలతో కుక్షి నింపుకునేవారు.ఈవిషయం తెల్సి ధనసంపాదనకైబైలు దేరాడు. నైమిశారణ్యంలో పుష్కర మునిని దర్శిస్తే, ఆయన హనుమ మంత్రోపదేశం చేశాడు.కానీ నిష్ఠతో చేసినా ఫలం దక్కలేదు.గాలుడనే వేటగాడు పుష్కరమునిదగ్గరకెళ్లి తన బాధచెప్పాడు. ఆయన పై భక్తితో ఆయన పాదాలు కడిగి ఆనీటినే తీర్ధంగా తాగాడు.మంత్రోపదేశం పొంది సిద్ధులు వశమైనాయి. ఇదితెల్సి ధ్వజ దత్తుడు రుషి దగ్గరకు పరుగెత్తి తన సందేహం బైట పెట్టాడు.అంతే తప్పు తెలుసుకుని హనుమోపాసనచేసి ధన్యుడైనాడు. పూర్వజన్మ లో అతను ధర్మ సారుడనే పండితుడు.కానీ అహంకారంతో ఒకరాజుని ఆక్షేపిస్తాడు. అందువల్ల ఈజన్మలో గురువు పై విశ్వాసంలేక దరిద్రంతో అలాటి అలమటిస్తున్నాడు. ఇప్పుడు హనుమ అనుగ్రహంతో సుఖసంతోషాలు సిరిసంపదలతో ఇల్లు కళకళలాడింది🌹
నమ్మకం,విశ్వాసం!:- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి