ఆంధ్రభోజునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణదేవరాయల
ఆస్థానంలో అష్టదిగ్గజాలలో మొదటి కవి.
సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండాలో రాయలుగారికే ఆశువుగా చెప్పి వారిచే గండపెండేరం తొడిగించుకున్న పండితుడు
ఆంధ్రావాజ్ఞ్మయంలో మొదటి ప్రబంధకావ్యం మనుచరిత్ర వ్రాసిన ప్రబంధ కవి.
మనుచరిత్ర కావ్యంలోలో ప్రవరాఖ్య, వరూధినిలు హిమాలయ వర్ణన నభూతో నభవిష్యతి అన్నారు విశ్వనాథవారు.
రచనాశైలి అద్వీతీయమై అల్లసాని వారి అల్లిక జిగిబిగియై నిలిచెనన్నది నానుడి.
రాయలు గారికి సలహాలనిచ్చి అష్టదిగ్గజాలలో ప్రథానుడై పెద్దనామాత్యునిగా ప్రసిద్ధి గాంచెను.
స్వయంగా శ్రీకృష్ణదేవారాయులు గారే పెద్దనామాత్యుని పల్లకి మోయడం వారిపాండిత్య ప్రతిభకు తార్కాణం.
పెద్దన వ్రాసిన స్వారోచిష మనుసంభవం ప్రౌఢకావ్య కృతిని రాయలుగారికిచ్చి ఆంధ్ర కవితా పితామహుడని బిరుదు పొందెను.
శృంగార రస వర్ణనచేసిన ధర్మాధర్మాలను పాఠకులకందించి నైతిక విలువల ప్రాధాన్యత తెలియచేసిన మహానీయులు.
సాహితీ జగతిన తనరచన ద్వారా ప్రధానంగా మనుచరిత్రలో వర్ణనాశైలి నేటికి ఎందరికో ప్రేరణ..!!
................................
అల్లసాని పెద్దనామాత్యులు: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి