చిత్ర స్పందన : - జయా
పువ్వుని
అందుకోవడానికి
పాప చెయ్యి చాచితే 
పాపను
అందుకోవడానికి
పువ్వు 
చెయ్యి చాచింది

అందరినీ
అన్నింటినీ
అందుకోవడానికి
చెయ్యి చాచి
నడిచే కాలాన్ని
 అనుసరించడమే
మన కర్తవ్యం


కామెంట్‌లు