ఇతరుల మేలు కోరండి : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చీకటి తారలొచ్చే వేళ
చక్కగ జ్యోతి వెలిగింది 
తిమిరాన్నది తరిమింది 
ఇంట్లో కాంతి నింపింది 

చంటి పాపా చూసింది 
బోసి నవ్వులు నవ్వింది
దీపం పురుగు వచ్చింది 
వెలిగే జ్యోతిని తాకింది 

దానికి చురుకు అంటింది
మలమల మాడిపోయింది
ప్రాణాలు అది వదిలింది 
పాపం పురుగును చూశారా 

వెలుగు నిచ్చే దీపమోలే 
మీలోని జ్ఞానాన్ని పెంచండి 
జతగా మీరంతా నిలవండి 
ఇతరుల మేలును కోరండి 


కామెంట్‌లు