మనదేశ9వ రాష్ట్ర పతి డాక్టర్ శర్మ 19ఆగస్టు1918లో భోపాల్ లోపుట్టాడు. తండ్రి ఖుషీలాల్ శర్మ చిన్న పాటి వైద్యుడు.చిన్న ఇంట్లో ఆధ్యాత్మిక భావాల్తో సదా శివభక్తిలో మునిగేవాడు.తనకొడుకులందరికీ శంకర్,శంభు,శివ,ఈశ్,సోమేశ్ అనే పేర్లుపెట్టాడు. శంకర దయాల్ శర్మ తల్లి చనిపోతే సవతితల్లి సంపత్ బాయి ప్రేమతోపెంచి పెద్ద చేసింది.అక్కసుభద్ర ఉన్నపుడు ఆమె వచ్చిపోతుండేది. ఆరోజుల్లో పెద్ద కొడుకును పేరుతో పిల్వకుండా భయ్యా అనేవారు.శర్మ తో సహా ఆమెను అంతా జగత్ చాచీ అనే పిల్చేవారు.తన నగలమ్మి సవతికొడుకు శంకర్దయాళ్ ని విదేశాలకి చదువుకోసం పంపిన అమృత మూర్తి ఆమె.భోపాల్ లో పుట్టిన ఆయన బాల్యం నుంచీ క్లాస్ ఫస్ట్.ఇంటర్ తర్వాత ఆగ్రాలో సెయింట్ జాన్స్ కాలేజీలో బి.ఎ.ఫస్ట్ క్లాస్ లోపాసై ఇలాహాబాద్,లక్నో యూనివర్శిటీల్లో హిందీ,సంస్కృతం,ఆంగ్లంలోమూడు ఎం.ఎ.లు ఫస్ట్ క్లాస్ లో పాసైనాడు.ఎల్.ఎల్.ఎం.చేశాడు ఉపకార వేతనంతో! విదేశాల్లో చదవాలనే తపన గ్రహించిన సంపత్ బాయి తననగలమ్మి కేంబ్రిడ్జ్ కి పంపింది. డాక్టరేట్ తో పాటు బార్ ఎట్ లా చేసిలక్నోలో స్థిరపడ్డాడు.క్విట్ ఇండియాలోచేరి జైలు శిక్ష అనుభవించాడు.దేశానికి స్వతంత్రం వచ్చాక భోపాల్ రాజు స్వతంత్రంగా ఉంటానని ఎదురుతిరిగాడు. సర్దార్ పటేల్ చావగొట్టి చెవులు మూయటంతో తగ్గాడు ఆనవాబు. శర్మ నవాబులు వ్యతిరేకంగా పోరాడి జైలుశిక్ష అనుభవించాడు.క్రమంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ1971లోఎం.పి.అయ్యాడు.ఆపై కేంద్ర మంత్రిగా 4వేలపైగా పోస్టాఫీసులు, QMS ఏర్పాటుచేసిన ఘనత ఆయనదే.1984లో ఆంధ్రప్రదేశ్ పంజాబ్,మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన ఆయన 1987లో ఉపరాష్ట్రపతిగా ఆతర్వాత పి.వి.గారి కాలంలో1992లోరాష్ట్రపతిగా సేవలందించారు 1999లో శివైక్యం చెందిన ఆయన హనుమాన్ భక్తుడు.లక్నో లో ప్రాచీన హనుమాలయం కిహాష్టల్లో విద్యార్థిగా ఉన్నప్పుడురెండు మైళ్లు నడిచివెళ్లేవాడు. ఆటలు,ఈత, పడవనడపటంలో ఆయనకి ఆయనే సాటి.ఆంగ్ల హిందీ ఉర్దూ సంస్కృత పండితుడు ఎన్నో పుస్తకాలు రచించారు🌹
శంకర్దయాళ్ శర్మ : - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి