ఒకరికి ఇచ్చేందుకు
ఎవ్వరి దగ్గర ఏమీ లేదు
ఒక్క జ్ఞానం తప్ప అనుభవం తప్ప
ఎవ్వరు ఎవ్వరికి ఏమి ఇవ్వరు
ఎవ్వరి కోసం ఎవ్వరు బ్రతకరు
ఎవ్వరి వ్యాలిడేషన్ కోసం
ఎవ్వరు వేచి చూడరు
ఎవ్వరి పర్సెప్షన్ వారిది
ఎవ్వరు ఎవ్వరిని ప్రేమించరు
ఎవ్వరూ ఎవరికోసం జన్మించరు.
.........................,.......................
పరిగెత్తడం అంటే పదవిని ఎక్కడం
పరిగెత్తడం అంటే గద్దెనెక్కడం
పరిగెత్తడం అంటే
అన్నిటినీ వదులుకుంటూ వెళ్లడం
పరిగెత్తడము అంటే
అందరినీ విడిచిపెట్టి వెళ్లడం
పరిగెత్తడము అంటే
పరిగెత్తి పరిగెత్తి ఆగిపోవడం
పరిగెత్తి పరిగెత్తి ఆగిపోవడం అంటే
పరమపదించడం.......!?
అంతకుమించి ఏమీ లేదు.!?
డా ప్రతాప్ కౌటిళ్యా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి