జీవన ప్రాయానం లో....
వత్సరమొక మైలు రాయి!
పుట్టినది మొదలు...
ఏ టి కే డు గడుస్తుంటే,
మనిషి మనుగడలో ... ఎదుగుదల , అభివృద్ధి .. !
వారసత్వాలతో ... కాలం సుదీర్ఘమే ఐనా...
మనిషి మనుగడ కాలం పరిమితమే...!
ఇందులో...
అభిరుచులు, ఆశయాలు
ఆరాటాలు , పోరాటాలు
గెలుపోటముల , ఫలితాలు....
అన్నీ కలిపి... ఒక మనిషి జీవిత కాలం లో...
చెప్పుకోదగ్గ కాలం...
కేవలం ఓ పది, పదిహేనేళ్లేగా...!
ఈ మాత్రానికే...
యిన్నిన్ని ఆరాటాలు...
అలజడులు , అశా0తి !
జీవన మాధుర్యం మాయం...!!
ఈ యే డైనా బాగుంటుం దేమో....!
ఏ టి కే డూ... ఇవే ఎదురు చూపులు...!!
ఫలితాలు... ఎప్పుడూ అ సంతృప్తే ...!
ఆనందం ఎక్కడ వుంటుంది...!?
ఈ ఎదురు చూపులు లేని చోటే...!
వీడని గతపు జ్ఞాపకాలు
భవిష్యత్ అపరిమిత ఊ హలు...
వీటి నుండి బయట పడ లేని వారికి...
ఎన్ని వత్సరాలు మారినా ఒకటే...!
ప్రతి నూత్న సంవత్సర మూ ఒక భ్రా0తే... భ్రమే!!
" చితి మన ప్రాణ0 పోయినాకే కాల్చుతుంది , గాని ఈ చింత ఉన్నదే...
మనిషిని బ్రతికి ఉన్నంత కాలం... కాల్చుతునే ఉంటుంది "
పెద్దలు ఎంత అనుభవం తో చెప్పారో కదా...!
ఆనంద జీవి ఎవరు అంటె
కేవలం వాస్తవంలో బ్రతుకు తున్న వాడే...!!
నిన్నటి అనుభవం...
రేపటికి పునాది కావాలి
ప్రతిబంధకము కారాదు కదా...!!
కేవలము రేపటి గురించి ఆలోచిస్తూ కూచునే వారు
ఈ రోజు దగ్గరే ఆగిపోతారు కదూ...!
ఈ రోజు చెయ్యాల్సింది సక్రమముగా చేసుకునే వారే... అందమైన ఆనంద మైన రేపటి రోజును చూడ గలరు... ఇది సత్యము...!
ఔను... ఇదే సత్యము..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి