ఆశల దారిలో అడుగులు
ఆగక చేసె పయనాలు
ఆనందం కోసం పరుగులు
ఆరని ఆరాటపు దీపాలు
కలలను గెలిపిస్తూ
కలతలు భరిస్తూ...
కనులలో కలవరాలు
కనిపించక దాచేస్తూ.....
మనసు పొరలు కరిగిస్తూ
మదిని కలుపు తొలగిస్తూ
మంచి పెంచి పోషిస్తూ....
మలుపులలో మజిలీ చేస్తూ...
చేతికందిన చిన్ని సరదాలు
మోపుకట్టి మోసుకుంటూ
చేతనైన సాయాలను
అడగకనే చేసుకుంటూ....
సంతోషాల సంపదలను
సహనంగా పోగుచేస్తూ...
సహకారపు చేయూతలు
ఏమారక అందిస్తూ......
భుజాలు మార్చుకుంటూ
బరువులను భరిస్తూ..
ఉత్సాహపు ఉరుకులను
అలసిపోనివ్వక అడుగేస్తూ..
ఆశించినవి అందుకుంటూ
అందినవి ఆస్వాదిస్తూ
అనుభవాలు అనుసరిస్తూ
అలసిపోని హృదయాలకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి