దేవతల రూపాలు...కార్తీక దీపాలు...:-కవిరత్న-సాహిత్యధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
సంస్కృతి సంప్రదాయాలే...
వెలిగే మన గౌరవ దీపాలు! 
నిండుగా కప్పుకున్న సంస్కార రూపం... 
నమస్కారాల నవ్యపూజల దివ్యదీపం..!

తిండి మీ కోసం...
బట్టలు పరుల కోసమన్న... 
పెద్దల మాటలు పరమార్థ గీతాలు
తిండితో జీవితం నడుస్తుంది
వస్త్రంతో గౌరవం దొరుకుతుంది
"ఆభరణాల కన్నా
"ఆచారమే అందమని తెలుసుకో...!

వింతైన
విచిత్రమైన
వస్త్రధారణతో...
విలువలు మరిచిన చోట...
కొరుక్కుతినే చూపులు
ఎక్కడో ఇరుక్కుపోయిన వేళ...
కామం కళ్ళుతెరిచి మనిషి మృగంగా... 
అంధుడిగా కామాంధుడిగా మారవచ్చు...
వస్త్రం వ్యక్తిత్వానికి అద్దమని గుర్తుంచుకో!

నక్కినక్కి పిచ్చికుక్కలు
మీ చుట్టూ తిరిగేను జాగ్రత్త
నిండుగా దేహాన్ని
కప్పుకున్నవారే దేవతలౌతారు
వారే నింగిలో జ్యోతుల్లా వెలుగుతారు
వారికే పూజలు... హారతులు...అభిషేకాలు..!

అర్థనగ్న పాశ్చాత్య
సంస్కృతి గోల మనకేల..? మనకు
కావాలి మన దేవతల నిండైన రూపాలే 
కార్తీక దీపాల కాంతిలో
మన సంస్కృతి వెలుగులు విరజిమ్మాలి..!

వెలిగించు
విలువల దీపం...
వస్త్రంతోనే గౌరవం...
సంస్కారమే శోభాయమానం...
దేవతల రూపాలు...కార్తీక దీపాలు... 
కాకూడదు వస్త్రాలు...సంస్కృతికి శాపాలు.


కామెంట్‌లు