వికారాబాద్ జిల్లా బొమ్మిస్పేట్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త డా. కీర్తి శర్మ, కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు, మొలక బాలల మాసపత్రిక కరస్పాండెంట్ కేవీఎం వెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి, భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె జీవితం నేటి మహిళలకు మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఆదర్శమని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థినులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా ఎదగాలని సూచించారు.
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకుని, క్రమశిక్షణతో ప్రతి పనిపై పూర్తి దృష్టి సారించాలని, ముఖ్యంగా SSC పరీక్షల సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. చదువుతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడం వల్లే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ప్రతి విద్యార్థి ఎదుగుదలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విత్తనంలా మార్గనిర్దేశం చేస్తూ రక్షణ కవచంగా నిలుస్తారని, ఆ విత్తనం నుంచి మంచి మొలకలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి రాధికా రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి