కె.ఆర్.నారాయణన్: - అచ్యుతుని రాజ్యశ్రీ

 10వ రాష్ట్రపతిగా నారాయణన్ బీద దళిత కుటుంబంలో పుట్టిన మేధావి.కేరళలోని ఉఝావుర్ పల్లెలో27 అక్టోబర్ 1920లోపుట్టాడు.పూర్తిపేరుకొచెరిల్ రమణ్ నారాయణన్. తండ్రి ఆయుర్వేద వైద్యంతో పల్లెవాసులకి చికిత్స చేసినా తిండి బట్టకి కటకట!తరతరాలుగా ఆకుటుంబ కులవృత్తి కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కోయడం. 7గురు సంతానంలో ఈయన 4వవాడు.రోజూ 15కి.మీ.పొలంలోంచి నడిచిలోయర్ ప్రైమరీబడిలో అదీ ప్రభుత్వ బడిలోనే చదివాడు.ఫీజు కట్టలేక క్లాస్ బైట నిలబడి వినేవాడు.అన్న ఆస్త్మారోగి ఐనా నారాయణన్ కోసంఇతరపిల్లల పుస్తకాలు తీసుకుని రాసి ఇచ్చేవాడు.హరిజన్ సేవక్ సంఘ్ స్కాలర్షిప్ తోఫస్ట్ క్లాస్ లో పాసై బి.ఎ.ఆనర్స్ ఇంగ్లీష్ ఎం.ఎ.చదివి జాబ్ కోసం ఢిల్లీ చేరాడు ప్రభుత్వ ఉద్యోగందొరికింది.దిహిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియాలోపనిచేస్తున్నప్పుడు 1945లో గాంధీజీని కలవటం జరిగింది.విదేశాలకెళ్లాలి అనే తాపత్రయంతో జె.డి.ఆర్.టాటా కు తన వివరాలిస్తూ లేఖరాయటం,లండన్ కెళ్లే సాయం లభించటంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బి.ఎస్సీ ఆనర్స్ చేశాడు.ప్రొఫెసర్ హెరాల్డ్ లాస్కీ ఆయన కి బోధకుడు,నెహ్రూ కికూడా బోధన చేశాడు.లండన్ లో చదువుతూ  సోషల్ వెల్ఫేర్ వీక్లీలో పనిచేశాడు.లక్కీగా భారత్ కి తిరిగిరాగానే నెహ్రూని కల్సిలాస్కీ ఇచ్చిన లేఖ చూపటం, వెంటనే నెహ్రూ భారత విదేశాంగ శాఖ లో ఉద్యోగం ఇవ్వటం మరోమలుపు1949లో రంగూన్ (నేటి మయన్మార్)లో దౌత్య కార్యాలయంలోరెండో సెక్రట్రీగాఉన్నప్పుడే  బర్మాయువతి మాటింట్ టింట్ తో పరిచయం పెళ్లికి దారితీసింది.కానీ చట్టవిరుద్ధంగా విదేశీవనితను పెళ్లాడరాదు కాబట్టి ప్రధాని కార్యాలయానికి లేఖ రాసి అనుమతిపొందాక ఆమెను పెళ్లాడాడు.ఆమె పేరు ఉష గామార్చాక  భారతీయ పౌరసత్వం పొందింది.ఆమె మహిళల పిల్లల కోసం కరుణ సంస్థ అధ్యక్షురాలిగా సోషల్ వర్క్ చేసింది.చిత్ర, అమృత అనే ఇద్దరు కూతుళ్లు.నారాయణన్ ఢిల్లీ జె.ఎన్.టి.యు.వైయస్సార్ వైస్ఛాన్సలర్ గా,ఆపై అమెరిక రాయబారిగా వెళ్లాడు.రాష్ట్ర పతి ఐనాక1998లో జనరల్ ఎలక్షన్స్ కి భార్య తో సహా క్యూలో నిలబడి ఓటువేశాడాయన!తన 16వ ఏట ఆయన రాసిన కవితలు మలయాళమనోరమలో పబ్లిష్ ఐనాయి.కేరళలో ఆయన  ఇంటిగృహప్రవేశంకోసం వెళ్లినపుడుఆయనకి ఆకవితలని పాడి స్వాగతం చెప్పటమే గాక కేసెట్ బహూకరించారు."నాజీవితంలో మరవలేని రోజు" అన్నాడాయన9నవంబర్2005లో85వ ఏట మరణించారు.ఏకతా స్థలంలో అంతిమ వీడ్కోలు పలికారు ఆయనకు 🌹
కామెంట్‌లు