మహిలో మహిళ ఉత్త కబుర్లతో కాక చేతల్లో ఆటపాటలతో
మూడేళ్ల బుడత ఉడతలతో పరుగులు పెడుతూ
ముప్ఫైదాటిన విద్యార్థులకు అమ్మగా దిశానిర్దేశం
చదువుల తల్లి తొలి అధ్యాపకురాలు
సావిత్రీబాయి ఫూలే తొమ్మిదేళ్ల వయసులో
ఇల్లాలిగా పతితో కలిసి పొలంలో హలంతో పాటు
బాలికలకు బడి ప్రారంభించి పేడనీటితో దాడిచేసినా
సహించి ఆరుగురు అమ్మాయిలతో బాలికాపాఠశాల
మహారాష్ట్ర ధీరవీరవనిత
తెలుగునాట దుర్గాబాయి దేశముఖ్
ఆంధ్రమహిళాసభతో వెలుగుబాట,
నేడు కొమాండూరి లక్ష్మిగారు
స్ఫూర్తిదాత, అందుకుంటున్నారు జోత
ఋషిపత్నులుగా చిన్నారులకు రక్షణ శిక్షణ క్రమశిక్షణ
గార్గి మైత్రీయి అపాల మరుగున
కొత్త శిక్షణ ఆటపాటలతో
నర్సరీ కె.జి.టీచర్ల బాధ్యత బరువులు గుర్తించని పెద్దలు
బుడతలను బేఫికర్ గా వదిలే
అమ్మలు!
గుర్తించరు ప్రాధమిక పాఠశాల అధ్యాపకురాళ్ల బాధలు
పూలలాంటి పిల్లల్ని అందమైన మాలలుగా
ఇంటికి దేశానికి అర్పించే అమ్మలు కొమ్మలు
వెన్నెముకలకిదే వందనాలు
పాదాభి చందనాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి