భగత్ సింగ్ సోదరి ప్రకాష్ కౌర్, 2014లో భగత్ సింగ్ 107వ జయంతి రోజునే కన్నుమూశారు.
ఆమె ఒక ఇంటర్వ్యూలో హృద్యమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. రక్షాబంధన్ నాడు జైలులో భగత్ సింగ్‌ను చివరిసారిగా కలిసినప్పుడు తన సోదరుడు తనతో ఇలా అన్నాడని ఆమె గుర్తుచేసుకున్నారు :
“నేను బ్రిటిష్ వారితో పోరాడుతు న్నాను. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దేశంలో అవినీతిని వ్యాపింపజేసే ఆ 'నల్లటి హృదయం' ఉన్న వ్యక్తులతో మీరందరూ పోరాడాల్సి ఉంటుంది.”
ఆయన మాటలు ఒక శక్తిమంతమైన స్ఫూర్తిగా నిలుస్తాయి. నిజమైన విప్లవం అంటే కేవలం స్వేచ్ఛ పొందడం మాత్రమే కాదు — అది దేశాన్ని అవినీతి, అన్యాయం, నైతిక పతనం నుండి కాపాడటం కూడా కదూ!
విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ సోదరి ప్రకాష్ కౌర్ కెనడాలో మరణించారు. అప్పుడామె వయస్సు 96 సంవత్సరాలు. అమరవీరుడి కుటుంబంలో మిగిలి ఉన్న ఏకైక సభ్యురాలు అమె. ఆమె టొరంటోలో నివసించారు. ఆమె మరణవార్తను పంజాబ్‌లోని హోషియార్‌పూర్ సమీపంలో నివసించే ఆమె అల్లుడు హర్భజన్ సింగ్ ధట్ తెలిపారు.
తన అల్లుడి సోదరుడైన కుల్జిత్ సింగ్ ధట్‌ను పంజాబ్ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపిన ఉదంతంపై ఆమె పట్టువదలక పోరాడారు.
ఈ ఎన్ కౌంటర్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులకు కోర్టు శిక్ష విధించిందికూడా.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ అత్యంత ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకరు.
1928లో లాహోర్‌లో ఒక బ్రిటిష్ పోలీసు అధికారిని చంపినందుకు అతనికి మరణశిక్ష విధించడం విదితమే. 1931 మార్చిలో అతనిని ఉరి తీశారు.
భగత్ సింగ్ 107వ జయంతి సెప్టెంబర్ 28న (2014) జరుపుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి