బొగ్గు నలుపని అంత అలుసా?: - కోలా సత్యనారాయణ - విశాఖపట్నం

 బొగ్గు నలుపుని అంత అలుసా!
మనిషినే అంటారు మసిబుగ్గు లాగ అని!
నల్లగున్నా గాని ఎన్నెన్నో లాభాలు! 
బొగ్గు తయారగు ఎండు కర్ర నుండి!
ప్రత్యేక బొగ్గు వచ్చు గనుల నుండి!
దీనినే అంటారు రాక్షసి బొగ్గని! 
రాక్షసి బొగ్గుతో రైలు నడిపేవారు...
 ఆవిరి ఇంజన్లు ఉన్న రోజుల్లో!
ఉక్కు పరిశ్రమకు ఈ బొగ్గు కావాలి!
విద్యుత్తు తయారీకి బొగ్గు కావాలి! 
పెన్సిల్ తయారీకి బొగ్గు కావాలి! 
బ్యాటరీ తయారీకి బొగ్గు కావాలి!
దంతాల శుభ్రతకు ఈ బొగ్గు కావాలి! 
పేలుడు సామాగ్రికి బొగ్గు కావాలి! 
దుస్తుల ఇస్త్రీకి బొగ్గు కావాలి!
వంట కుంపట్లకు ఈ బొగ్గు కావాలి! 
చలి కుంపట్లకు ఈ బొగ్గు కావాలి!
 సాంబ్రాణి ధూపంకు ఈ బొగ్గు కావాలి! 
చిన్న చూపు వద్దండి ఈ బొగ్గు పైన!
సాక్షాత్తు కృష్ణయ్య నలుపుగా లేడా!!
కామెంట్‌లు