గొప్ప సంఘసంస్కర్త విద్యావేత్త సావిత్రిబాయి : - నామ వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం

 అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు వర్గాల బాంధవుడు, పీడిత వర్గాల పితామహుడు,విద్యా వేత్త, ఆనాడు తన సంఘ  సేవా కార్యక్రమాల ద్వారా, ఆనాటి ప్రజల చేత, బ్రిటిష్  ప్రభుత్వం చేత  భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మా అని పిలిపించుకున్న మహనీయుడు జ్యోతిబాపూలే గారి యొక్క సతీమణి, కవయిత్రి,  రచయిత్రి, సంఘసంస్కర్త,క్రాంతి జ్యోతి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలి సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి శుభాకాంక్షలు అందరికి. 
       
🌹:-1931 జనవరి 3 న మహారాష్ట్రలోని నైగావు గ్రామంలో జన్మించింది. చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్లగా పెరిగింది. ఒకరోజు చెట్టు ఎక్కి జారిపడి కొమ్మ పట్టుకుని కిందికి జారింది. అది చూసి, ఆమె అల్లరి తట్టుకోలేక ఒక రోజు వాళ్ళ అమ్మ  ఈ పిల్లకు ఎంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే అంత మంచిదని, ఇలానే ఉంటే ఏ కాలో చేయో విరిగితే ఎవరు చేసుకుంటారు. లేకపోతే ఇంట్లోనే పడి ఉంటుంది అని అనేది. అప్పుడు సావిత్రిబాయి పూలే, అయితే నాలాగాచెట్లెక్కుతాడా, బయట మంచం మీద పడుకుని, చుక్కలు లెక్క పెడతాడా! అనితల్లితో అనేది.                                            
          అప్పుడు ఆవిడకు తొమ్మిదవ ఏట, 11 సంవత్సరాలు కలిగిన జ్యోతిబాపూలే గారితో వివాహం జరిగింది. వివాహం ఆయన దగ్గర నుంచి సావిత్రిబాయి గారు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసేది. గారు చేసిన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించేది. వారి కంటే ముందు సమాజంలో స్త్రీకి అట్టడుగు స్థాయి అవకాశాలు ఇచ్చేది. ఆనాటి సమాజంలో తక్కువ వర్ణాలైన శూద్రులతో పాటు స్త్రీలకు చదువుకునే హక్కు లేకుండేది. ఆ కాలంలో బ్రిటీష్ వారు మనకు ఒక మేలు చేయడం జరిగింది. అందరికీ చదువుకొనే అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ సమయంలోనే  జ్యోతి బా పూలేగారు అలాంటి బ్రాహ్మణ వర్గాన్ని ఎదిరించి పాఠశాలకు వెళ్లి చదువుకోవడం జరిగింది. తెలంగాణలో అతనికి ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ తర్వాత అతను సమాజంలో అట్టడుగు వర్గాల వాడల్లోకి వెళ్లి, వైద్యం చేసేవారు. ఆ సమయంలోనే వారు వెనుకబడడానికి కారణం వారికి చదువు కోకపోవడమే కారణమని గుర్తించి వాళ్ళుకు చదువు నేర్పాలనుకున్నాడు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా  కొంతమంది బ్రాహ్మణ మిత్రుల సహకారంతో బాలికలకు,  స్త్రీలకు, చదువు చెప్పడానికి పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో అలాంటి బ్రాహ్మణ వర్గం అనేక రకాలుగా కొట్టడం తిట్టడం బెదిరించడం  ఇంకా అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. కొన్ని రోజుల వరకు సాఫీగానే సాగుతున్న సమయంలో  ఒక రోజు పులి గారు చాలా దీనంగా నీరసంగా ఇంటికి వచ్చాడు. సావిత్రిబాయి గారు నీళ్లుగానే కడుక్కొని కూర్చున్నాడు. తనని గమనించిన సావిత్రిబాయి గారు ఏమైంది ఈరోజు ఇంత నీరసంగా ఉన్నారు అని అడిగింది. అతని ఏం లేదులే అని ఆమెను ఊరుకో పెట్టాడు. సావిత్రిబాయి గారు మరోసారి అతనిని అడిగింది. అయినా అతను ఏమి చెప్పలేదు. రాత్రంతా ఆలోచించి, ఏం లేవగానే సావిత్రిబాయితో, సరళ బోధించడానికి వచ్చిన ఉపాధ్యాయులను, బ్రాహ్మణ వర్గాలు బెదిరించి కొట్టాయి. బోధించడానికి రావడం లేదు.  నువ్వు పాఠశాలలో బోధించడానికి రావాలి  అని ఆమెతో అంటాడు. నాకు చదువు రాదు కదా నేను ఎట్లా బోధిస్తాను అని సావిత్రిబాయి గారు పూలే గారితో అనడం జరిగింది.  నీకు నేను చదువు నేర్పిస్తాను ఎలా బోధించాలో చెప్తాను అని ఆ రోజు నుంచి ఆవిడకు చదువు నేర్పడం మొదలుపెడతాడు. చదువు వచ్చిన కొన్ని రోజులకు ఆమెకు చరిత్ర భూగోళం అర్థశాస్త్రం, సాహిత్యాన్ని బోధిస్తాడు, ఆవిడ చాలా ఆసక్తిగా నేర్చుకుంటుంది. పోతిగా నేర్చుకున్న తర్వాత ఆవిడ ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి వెళుతుంది. అలా వెళ్తున్నటువంటి సావిత్రిబాయి గారి మీద ఆడి బ్రాహ్మణ వర్గం ఎండనీళ్లు,  బురద నీళ్లు చల్లడం, రాళ్లు విసరడం చేసేవారు. అయినా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా, వర్షాలకు రోజు రెండు చీరలు తీసుకొని వెళ్ళేది. కట్టుకొని పోయిన చీర మీద ఈ మలినాలని వేస్తే వెళ్ళిన తర్వాత మార్చుకునేది. అయినా గాని ఒక్కదానికి బోధించడం కష్టం అయ్యేది. అప్పుడు అక్కడనే ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ ఫాతిమా షేక్, తన పాఠశాలకు భవనం ఇవ్వడమే కాకుండా, తను కూడా ఆ పాఠశాలలో బోధించడానికి వచ్చేది, ఆ పాఠశాలలో బోధించిన రెండవ ఉపాధ్యాయిని. తర్వాత వారిద్దరూ దేదీప్యమానంగా  బోధిస్తున్నారు. దాదాపు 30 పాఠశాలకు పైగా స్థాపించి, వాటిలో గారిని వర్గాల స్త్రీలు పిల్లలకి కాకుండా, బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్యా బోధన సాగించేవారు. అదేవిధంగా పూలే గారు స్థాపించినటువంటి సత్యశోధకు సమాజాన్ని, చాలా చక్కగా నిర్వహించేది. అతను చేసే ప్రతి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ఒకవైపు పాఠశాలలో బోధన, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి పూణేలో ప్లేగు వ్యాధి సంభవించడం జరిగింది. అక్కడ అందరికంటే  బాగా బాధపడుతున్నటువంటి వారు అణగారిన వర్గాలు. వారిని దగ్గర తీసి వైద్యం చేసే వారు ఎవరూ లేకపోవడం పూలే గారు గుర్తించారు, వెంటనే తను తన భార్య సావిత్రిబాయి తో కలిసి, నీ ఊరి బయటకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత కొన్ని రోజులకు ప్లేగు వ్యాధి సోకి పూలే గారు కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలతో పాటు సామాజిక కార్యక్రమాలన్నీ తన త పుత్రుడి సహాయంతో  పూలే గారే నిర్వహించేది. అయితే అంతకుముందే ఆదర్శప్రాయాలు అయినటువంటి పోలీస్ సావిత్రిబాయి గారు సామాజిక సేవ  చేయుటకు పిల్లలు ఉంటే కష్టమవుతుందని పిల్లలు లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే వారు ఒక  బ్రాహ్మణ బాల్య వితంతు చనిపోతే ఆమెకు  పుట్టిన బిడ్డని తీసుకొని పెంచుకుంటారు. అతని డాక్టర్ చదివిస్తారు. అతని పేరు యశ్వంత్. ఇంకా ఆ ప్లేగు వ్యాధి మహమ్మారి పూనాని వదలకుండా ఇస్తూనే ఉంది. అయితే ఒక రోజు ఆనగారిన వర్గాల వీధులలో సావిత్రిబాయి గారు వెళుతుంటే, ఒక గుడిసెలో ఒక పిల్లవాడు ఒడి తిరుగుతూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు, ఎందుకంటే ఆ వ్యాధి అంటువ్యాధి అది వీళ్ళకి కూడా సోకి చనిపోతానేమోనని భయం వలన. అయితే సావిత్రిబాయి గారు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని, పెంపుడు కుమారుడైనటువంటి యశ్వంత్ దగ్గరకు తీసుకువెళ్లి ఇతనికి వైద్యం చేయమని చెబుతుంది. ఇప్పుడు అతను అమ్మ నువ్వు ఇతని ఎత్తుకొస్తే నీకు అంటువ్యాధి సోకుతుంది కదా అంటాడు. అయినా పర్వాలేదా చిన్న పిల్లవాడు పడుతూ చావడం నాకు మంచి గనింపిచలేదు. అందుకే నువ్వు అతనికి వైద్యం చేయమని కోరుతుంది. అప్పుడు వైద్యం చేసి ఆ పిల్లవాని అతడు బతికిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు  సావిత్రిబాయి గారు పులి లాగానే ప్లేగు వ్యాధితో1897 చనిపోతుంది. చనిపోయే ముందే తన కుమారునికి ఈ సేవా కార్యక్రమాలు చేయమని అప్పగిస్తుంది. ఇలా తన జీవితాన్ని లెక్కచేయకుండా నిస్వార్ధంగా ప్రజలే తన పిల్లలుగా భావించి, అట్టడుగు వర్గాల యొక్క బాగు కోసం నిరంతరము శ్రమించే సేవ చేసినటువంటి మహనీయురాలు జ్యోతిబాపూలే. రోజుల్లో ఇలా నిస్వార్ధంగా సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆమె చేసినటువంటి సేవ కార్యక్రమాలు ఫలితంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అందరికీ అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. అందుకే ఈరోజు  అన్ని రకాల వర్గాలు చదువు తో పాటు అన్ని రకాలైనటువంటి పనులు చేసుకోగలుగుతున్నారు. ఈరోజు మనం ఎంత స్థాయిలో ఉండడానికి మార్గదర్శకులు, పూలే సావిత్రి బాయి గారు. కాబట్టి ఇలాంటి మహనీయురాలు యొక్క ఆశయాలను చేపట్టి మనమందరం ముందుకు వెళ్లాలని, సేవ చేయాలని కోరుకుంటున్నాను.
                     

కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం