మనదేశం పవిత్రత కు పుణ్య కార్యాలకు ఆలవాలం ఇక్కడ తర్పణాలు పిండప్రదానం చేస్తారు.మన పిండప్రదానం మనం చేసుకునే ఏకైక క్షేత్రం.మనం చనిపోయాక ఎవరూ ఏంచేయకపోయినా మన ఆత్మ శాంతిస్తుంది అని ఓనమ్మకం ఇక్కడ బండరాయి కూడ పవిత్రమైనదే. దానివెనక ఓకథ ఉంది.మరీచి మహర్షి భార్య ధర్మవ్రత. భర్త కి సేవచేస్తున్నప్పుడు బ్రహ్మ దేవుడు రావటంతో ఆయన్ని ఆహ్వానించింది. మహర్షికి కోపంవచ్చి భార్యను బండరాయిగా మారు అని శపిస్తాడు.ఆమె వలవల ఏడిస్తే"నీపైన త్రిమూర్తులు ఆసీనులవుతారు. గయాసురుడనే రాక్షసుని పీడ నీవల్ల తొలగుతుంది." అని ఓదారుస్తాడు.ఆమె బండరాయిగా మారింది.
ఇక గయాసురుడనే రాక్షసుడు విష్ణువుని గూర్చిఘోరతపస్సు చేశాడు.ముల్లోకాలు తల్లడిల్లటంతో, విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు.వాడు " నాదేహం పుణ్యక్షేత్రాలన్నిటి కన్నా పవిత్రం గా ఉండి పూజ లందుకోవాలి" అని అడిగాడు.తథాస్తు అనగానేవాడికి ఎక్కడ లేని గర్వం కల్గిదేవతల్ని ఏడ్పించసాగాడు. బ్రహ్మ కోరిక పై గయాసురుడు తన శరీరంపై యాగం చేయటానికి అనుమతి ఇస్తాడు.ధర్మవ్రత బండగా మారిందని మనకు తెలుసుకదా? దేవతలంతా తమశక్తుల్ని ఆబండపై కేంద్రీకరించటంతో దాన్ని గయాసురుని శరీరంపై పెట్టి బలంగా అదిమారు. అలా పూర్ణాహుతి గావించారు. అదే పవిత్ర గయ క్షేత్రం.పితృకార్యాలకు ఆలవాలం🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి