సూర్యగమనం మకరరాశి లోకి సంక్రమణమే సంక్రాంతి పరమార్ధమని, పాత వస్తువులు ఆహుతినిస్తూ కొత్తదనాన్ని స్వాగతించే భోగభాగ్యాల సంకేతమే భోగియని, పశువుల పండుగ కనుమ అని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. పాఠశాలలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భోగి మంటను వేసి ముగ్గులు వేసి ఉల్లాసంగా గడిపారు. సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ఆవు పేడ పిడకలను, మామిడి రేగు మేడి బెరడులను భోగి మంటలో వేయుట వలన గాలిలో ఔషధ గుణాలు ఏర్పడుతాయని ప్రజల ఆరోగ్యం భోగి సూచిక అని అన్నారు. ఇంద్రునికి గుణపాఠంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరినెత్తిన రోజుకు చిహ్నంగా భోగి పండుగ కూడా అని అన్నారు. రైతుల కష్టానికి ఫలితంగా ఇంటికి పంట చేరే సంబరం ఈ సంక్రాంతి కనుక రైతు పండుగ అని కూడా పిలుస్తారని తిరుమలరావు అన్నారు. గంగిరెద్దు బసవన్న గోమాతల కనువిందే, కనుమ పండుగ ముఖ్యోద్దేశమని, పశువులను పూజించే పండగే కనుమ అని అన్నారు. తిరుమలరావు సంక్రాంతి గీతాలు ఆలపించగా విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేస్తూ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. రేపటి నుంచి తొమ్మిది రోజులు పండగ సెలవులు కనుక ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముగ్గులు వేసిన బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు ఉప్పలపాటి ఆదిలక్ష్మి యెందువ వెంకట రమణ వెలగాడ రాము ముల్లు సుజాత ఎం.పెంటయ్య జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామవాసులు బత్తుల రామలక్ష్మి, డొప్ప ఊహ, దారబోయిన జ్యోతి, అరటికట్ల స్వప్న, పేర్ల దివ్య, పలిశెట్టి శ్యామల, చిర్రా అలివేలు, పలిశెట్టి పూజశ్రీ, పి.ఇందు, పి.ఆదిలక్ష్మి, చిర్రా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
భోగాల సంక్రమణ కనువిందే, భోగి సంక్రాంతి కనుమ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి