వల్లాల ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు..

  జనవరి 28  నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10 వ తరగతుల్లో ప్రవేశానికి జనవరి  28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది,  వచ్చే ఏప్రిల్ 19 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు.
వల్లాల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో 100 సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఏడవ తరగతి నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూ ఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125, ఓసీలు రూ. 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. www.telanganams.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
కామెంట్‌లు