హుజూర్ నగర్ సూర్యాపేటలో తెలుగు భాష జాతీయ కవి సమ్మేళనం; సినీ సంగీత విభావరి

 అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  సామాజిక సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ  ఉషోదయ ఫౌండేషన్   అధ్వర్యంలో  మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నూతన సంవత్సరము ప్రారంభంలో తెలుగు భాషకు పట్టము కడుతూ     తెలుగు భాషకు సోగస్సులు అద్దుతూ జాతీయ కవి సమ్మేళనము  అలనాటి మేటి నేటి సాహిత్యంతో సినీ సంగీత విభావరీ  కార్యక్రమంను  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోనీ హుజూర్ నగర్ లో 4.1.26 తేదీ   ఆదివారం ఏర్పాటు చేయడము జరిగింది.  విచ్చేసిన కవులు కళాకారులను తెలుగు భాష సేవా దీప్తి పురస్కారంతో సత్కరించి  కార్యమoను హుజూర్ నగర్ అధ్యక్షులు షేక్ జాన్ సైదా మరియు    మేరుగు గురవయ్య  రాళ్ళబండి రామారావు కార్యక్రమంను పర్యవేక్ష కులుగా కార్యక్రమం ముందుకు సాగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నుండి 100 మంది  కవులు కళాకారులను తెలుగు సేవా దీప్తి పురస్కారంతో సత్కరించడం జరిగినది. మరుగున పడుతున్న జానపద కళలను ముందుకు నడిపే ఆయుధమని డా. యు. వి రత్నo అన్నారు. భావి జగతికి తెలుగు సంపదను అందించడం అందరి  బాధ్యతనిడా. ధనాశి ఉషారాణి అన్నారు. స్వేచ్ఛ సంస్థ ప్రతినిధులు విజయ కళాకారులు కొట్టుబాబు మొదలగువారు పాల్గొన్నారు.
కామెంట్‌లు