మనకు బ్రహ్మ ఆలయాలు ఎక్కువ లేవు.ఆం.ప్ర.చేబ్రోలు లో ఉంది. రాజస్థాన్ లోనిపుష్కర్ లో బ్రహ్మ కి పూజలు జరుగుతాయి.కానీ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లోబ్రహ్మకి పూజ అర్చన జరగటం అద్భుతం! వరల్డ్ ట్రేడ్ సెంటర్కి దగ్గరలో ఎరావన్ ప్రాంతంలో గ్రాండ్ హయాత్ హోటల్ పరిసరాల్లో ఈఆలయం ఉంది.బంగారు చతుర్ముఖుడు దండం,గరిటె,జపమాల, పుస్తక ధారణతో ఆకర్షణీయమైన విగ్రహం చూపరులను కట్టిపడేస్తుంది. ఒడిలో కమండలం ఉంది. ఛాతీపై జందెం స్పష్టంగా కనబడుతుంది.చుట్టూ గోడలు లేవు కాబట్టి నాల్గుముఖాలు స్పష్టంగా కనపడతాయి.మనం చుట్టూతిరిగి చూడవచ్చు.నలువైపులా పూలు అమరుస్తారు.థాయ్ చైనాజాతివారు ఆవిగ్రహానికి పూజచేస్తారు. పెద్ద వెండి పాత్రలోఉన్న నీటితో చేతులు తలపై చిలకరించుకుంటారు.ఆప్రాంతమంతా దీపాలు అగరుబత్తీలు వెల్గిస్తారు.1950లో థాయిలాండ్ లో ఓఅంతర్జాతీయ సమావేశం జరిగినప్పుడు ఎరావన్ హోటల్ కట్టడం మొదలుపెట్టినపుడు అడుగడుగునా ఆటంకాలు కల్గాయి. ఖరీదైన చలువ రాళ్లతో వస్తున్న ఓడ బ్యాంకాక్ కి రాకుండానే మధ్యలో మాయమైంది. అందుకే కూలీలేమన్నారంటే భూమికి శాంతిపూజలు చేసితీరాలని.అక్కడున్న ఆత్మలని శాంతింపజేయాలని పట్టుబట్టడంజరిగింది. బ్యాంకాక్ పోలీస్ మేజర్ జనరల్ కి బాధ్యత అప్పజెప్పటం,అతను ప్రసిద్ధ జ్యోతిష్కుడు ఎడ్మిరల్ లువాంగ్ని
సలహా అడిగాడు.అశుభసమయంలో పునాది తవ్వటం వల్ల ఆటంకాలేర్పడుతున్నాయని బ్రహ్మ దేవుడు*చతుర్ముఖతాన్ తావోమహాప్రామ్* విగ్రహం నెలకొల్పాలని చెప్పడంతో అలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహం చేశారు.దానిపైబంగారుపూత పూయటంతోపాటు 1956లో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిఏడూ 9నవంబర్ రోజున దేవునిదర్శనానికై జనం వస్తారు.అలా హోటల్ నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండ సాగటంతో ఆచతుర్ముఖుని తావో మహాప్రామ్ కృప సానుభూతి తమకు లభిస్తుందని జనం నమ్ముతారు.అంతా సులభంగా గుర్తుపెట్టుకోవటంకోసం ఎరావన్ క్షేత్రం అని పిలుస్తారు.ఆదేవుని వాహనం మూడుముఖాల ఎరావన్ అనే ఏనుగు.వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!?🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి